ETV Bharat / bharat

ఆ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ! - మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి

కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో భోపాల్​, ఇండోర్​ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించే ఆలోచనలో ఉన్నట్లు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​ ప్రకటించారు. కరోనా కేసులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

COVID-19: Night curfew likely in Bhopal, Indore, says Chouhan
'ఆ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తాం'
author img

By

Published : Mar 13, 2021, 2:13 PM IST

భోపాల్​, ఇండోర్​ నగరాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో ఆ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించే యోచనలో ఉన్నట్లు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం లేదా సోమవారం నుంచి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించిన చౌహాన్​.. ప్రధాన నగరాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా కేసులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం శివరాజ్ సింగ్​ చౌహాన్​ ఆదేశించారు. ప్రజలంతా వైరస్​ నిబంధనలు పక్కాగా పాటించేలా చూడాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి వచ్చే రైలు, రోడ్డు, విమాన ప్రయాణికులకు థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించాలని ​ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలనే అంశంపైనా చర్చించినట్లు ఓ అధికారి తెలిపారు.

ఇండోర్​లో కరోనా కేసులు 61,642కి చేరగా.. భోపాల్​లో 45,079కి పెరిగాయి.

ఇదీ చదవండి: భారత్​లో ఒక్కరోజే 24 వేల 882 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.