ETV Bharat / bharat

సుప్రీంకోర్టులో కేసుల విచారణపై కరోనా ప్రభావం - సుప్రీం కోర్టు తాజా వార్తలు

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య.. సుప్రీంకోర్టుపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా సాధారణ కేసులను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ధర్మాసనం.. అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది.

Surpeme Court of India
సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 20, 2021, 9:16 PM IST

దేశంలో రోజు రోజుకూ ఉద్ధృతమవుతున్న కరోనా మహమ్మారి సుప్రీంకోర్టుపై ప్రభావం చూపింది. దీంతో బుధవారం నుంచి అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపట్టనున్నట్టు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సాధారణ కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

అత్యవసర కేసులకు సంబంధించిన వ్యాజ్యాలను ఆయా ధర్మాసనాలు.. వర్చువల్​గా విచారణ చేపట్టనున్నాయి. వీటికి సంబంధించిన పిటిషన్​లను మెయిల్​ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'రాముడి ఆదర్శాలను మనమూ పాటిద్దాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.