ETV Bharat / bharat

'ధిక్కరణపై కోర్టు అధికారాన్ని తొలగించలేరు'

కోర్టు ధిక్కరణకు(contempt of court) పాల్పడిన వారిని శిక్షించేందుకు న్యాయస్థానాలకు రాజ్యాంగం ద్వారా అధికారం లభించిందని, దానిని శాసన చట్టాల ద్వారా కూడా తొలగించలేరని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఓ ఎన్​జీఏ ఛైర్​పర్సన్​పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Sep 29, 2021, 3:15 PM IST

కోర్టు ధిక్కరణపై(contempt of court) న్యాయస్థానాలకు ఉన్న అధికారాన్ని శాసన చట్టం ద్వారా కూడా తొలగించలేరని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు(Supreme court). కోర్టు అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. అపవాదుకు గురిచేయడం తప్పేనని, గతంలో రూ. 25 లక్షలు డిపాజిట్​ చేయాలన్న ఆదేశాలను ధిక్కరించినందుకు ఓ ఎన్​జీఓ ఛైర్​పర్సన్​ను దోషిగా తేల్చింది. ' కోర్టు ధిక్కరణకు(contempt of court section) పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. న్యాయస్థానాన్ని అవమానించేందుకు చేసిన అతని చర్యను సమర్థించలేం' అని పేర్కొంది.

రూ.25 లక్షలు డిపాజిట్​ చేయాలన్న ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరుతూ సూరజ్​ ఇండియా ట్రస్ట్ అనే ఎన్​జీఓ ఛైర్​పర్సన్​ రాజీవ్​ దయ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టింది.. జస్టిస్​ సంజయ్​ కిషన్ కౌల్​​, జస్టిస్​ ఎంఎం సుంద్రేశ్​ల ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, కోర్టుతో సహా అందరిపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

" ధిక్కరణ నేరానికి పాల్పడిన వారిని శిక్షించేందుకు ఈ కోర్టుకు రాజ్యాంగం ద్వారా అధికారం లభించింది. దానిని శాసన చట్టం ద్వారా కూడా తొలగించలేరు."

​- సుప్రీం ధర్మాసనం.

ఈ మేరకు దయకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. అక్టోబర్​ 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టులను అపవాదుకు గురిచేసినందుకు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది. అయితే.. న్యాయస్థానం ఆదేశించిన నగదును కట్టేందుకు తనకు తగిన వనరులు లేవని, క్షమాభిక్ష కోసం.. రాష్ట్రపతిని కోరతానని కోర్టుకు చెప్పారు దయ.

ఇదీ కేసు..

తరచుగా ఉన్నత న్యాయస్థానం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా 64 పిల్స్​ దాఖలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. రూ.25 లక్షలు డిపాజిట్​ చేయాలని 2017లో ఆదేశించింది.

ఇదీ చూడండి: Supreme Court: సుప్రీం తీర్పులకు కొరవడుతున్న మన్నన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.