ETV Bharat / bharat

భారత్ x చైనా: 9వ విడత సైనిక కమాండర్ల భేటీ - తూర్పు లద్దాఖ్​లో భారత్​ చైనా

India and China
భారత్ x చైనా: 9వ విడత సైనిక కమాండర్ల భేటీ
author img

By

Published : Jan 24, 2021, 9:52 AM IST

09:31 January 24

భారత్ x చైనా: 9వ విడత సైనిక కమాండర్ల భేటీ

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా భారత్​-చైనా సైనిక ప్రతినిధులు నేడు భేటీ అయ్యారు. మోల్డో సెక్టార్​లో ఈ సమావేశం జరుగుతోంది.

నవంబర్ 6న ఎనిమిదో విడత సైనిక చర్చలు జరిగాయి. బలగాల ఉపసంహరణపై ఇరువర్గాలు విస్తృతంగా చర్చించాయి. అయితే ఇదివరకటి చర్చల్లాగే ఇందులోనూ ఎలాంటి ముందడుగు పడలేదు.

ఉపసంహరణ ప్రక్రియ చైనానే ప్రారంభించాలని భారత్ చెబుతూ వస్తోంది. అప్పటివరకు భారత సైన్యం అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పింది. భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో పాటు, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె సైతం ఇదే విషయాన్ని పలు మార్లు స్పష్టం చేశారు. దాదాపు 50 వేల మంది భారత సైనికులు తూర్పు లద్దాఖ్​ సరిహద్దు వద్ద పహారా కాస్తున్నారు. చైనా సైతం అదే స్థాయిలో బలగాలను మోహరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.