Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 7,946 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 37 మంది మరణించారు. ఒక్కరోజులో 9,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,16,078
- క్రియాశీల కేసులు: 62,748
- మొత్తం మరణాలు: 5,27,911
- కోలుకున్నవారు: 4,38,45,680
Vaccination In India : దేశంలో బుధవారం 12,90,443 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,12,52,83,259 కు చేరింది. ఒక్కరోజే 2,66,477మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 652,816 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,942 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 607,922,595కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,495,689మంది మరణించారు. శనివారం మరో 834,638 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 584,030,694కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,39,582 కేసులు వెలుగుచూశాయి. మరో 311 మందికిపైగా మరణించారు.
- దక్షిణ కొరియాలో 1,03,919 కొవిడ్ కేసులు,75 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో 71,334 కొత్త కేసులు, 403 మరణాలు వెలుగుచూశాయి.
- రష్యా, ఇటలీ, జర్మనీ, తైవాన్, బ్రెజిల్‌లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఇవీ చదవండి: ఐదో పెళ్లికి సిద్ధమైన 'అతడు'.. రెండో భార్య, ఏడుగురు పిల్లల ఎంట్రీతో..
ఏడు నెలల గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్