Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 35 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,555 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,34,188
- మరణాలు: 5,28,337
- యాక్టివ్ కేసులు: 47,922
- రికవరీలు: 4,39,57,929
Vaccination In India :
దేశంలో శనివారం 14,84,216 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 216.56 కోట్లకు చేరింది. ఒక్కరోజే 2,89,228 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,38,128 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 774 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,68,56,201 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,30,060 మంది మరణించారు. మరో 5,94,451 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,62,84,233కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 77,804 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 186 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 58,305 కేసులు వెలుగుచూశాయి. మరో 107 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో 43,400 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 57 మంది మృతి చెందారు.
- తైవాన్‌లో 39,628 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో 33,162 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: పోలీసులపై గ్రామస్థుల దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు.. అదే కారణం!
'సూపర్ పవర్‌గా భారత్.. ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించేలా దేశీయ వ్యవస్థలు!'