Cop arrested for raping woman: సమస్యలు పరిష్కారిస్తాననే నెపంతో మహిళపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ అరెస్టయ్యాడు. మహారాష్ట్రలోని ఠాణెలో ఈ ఘటన వెలుగుచూసింది.
ఇదీ జరిగింది: కొంతకాలం కింద ఓ 27 ఏళ్ల యువతి.. తన ఫిర్యాదు చేసేందుకు నవ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఆమెతో సన్నిహతం పెంచుకున్నాడు. తన బాధలు తీరుస్తానని నమ్మించి అనేక చోట్లకు పిలిచేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించిందని అధికారులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
పెళ్లిలో చిన్నారిపై: మధ్యప్రదేశ్ దాటియా జిల్లాలో దారుణం జరిగింది. టిలేత గ్రామంలో పెళ్లి కార్యక్రమం జరుగుతుండగానే తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు దూరపు బంధువు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుంది. 24 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
సినిమా అవకాశమిస్తానని బాలికలపై: సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై మహారాష్ట్రలోని పాల్గఢ్లో కేసు నమోదైంది. గత ఏడాది కాలంగా 13 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలను.. వసై ప్రాంతంలోని అడవికి తీసుకెళ్లి అతడి వారిపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వారితో అసహజ సెక్స్‌లో పాల్గొన్నట్లు అతడిపై ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. వారి అభ్యంతరకర ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి బాలికలను రూ.70 వేలు కూడా ఆ వ్యక్తి డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. బాలికల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు దిల్లీకి చెందిన ఓ మహిళ నొయిడా పోలీసుల ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: భార్యను చంపి జైలుకు.. చేతిమీద 'ఐ లవ్ యూ' అని రాసి సూసైడ్!