కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప(Yediyurappa) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయటం, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికే తాను ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తున్నానని స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయటంపైనే ప్రస్తతం నేను దృష్టి సారించాను. ఎవరైనా.. ఎక్కడికైనా వెళ్తే(నాయకత్వ మార్పు కోరుతూ ఇటీవల కొంతమంది దిల్లీలోని హైకమాండ్‌ను కలిసిన నేపథ్యంలో) వారికి అక్కడ సరైన సమాధానాలు ఇచ్చి పంపి ఉంటారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి సమష్టిగా పని చేయాలి. కరోనాను ఎదుర్కోవటమే ప్రస్తుతం నా ముందున్న ప్రధాన లక్ష్యం.
-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
'శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా?' అని విలేకరులు ప్రశ్నించగా.. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని యడియూరప్ప వెల్లడించారు.
ఇదీ చూడండి: వీరప్పన్ తూటాలకు ఎదురు నిలిచిన పోలీసు మృతి