ETV Bharat / bharat

'కాంగ్రెస్​ పతనంతో ప్రజాస్వామ్యానికి ముప్పు'

గుజరాత్​లో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ విఫలమవడంపై ఆ పార్టీ నేతలు సమీక్షించుకోవాలన్నారు శివసేన నేత సంజయ్​ రౌత్​. కాంగ్రెస్ పతనమైతే ప్రజాస్వామానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈక్రమంలోని భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.

Cong's fall in Guj civic polls detrimental to democracy: Raut
'కాంగ్రెస్​ పతనంతో ప్రజాస్వామ్యానికి ముప్పు'
author img

By

Published : Feb 24, 2021, 3:55 PM IST

ఒకప్పడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్​.. ఇప్పుడు​ అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన నేత, ఎంపీ సంజయ్​ రౌత్. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ పతనం ప్రజాస్వామ్యానికి హానికరమని​.. పార్టీ అధిష్ఠానం దీనిని తీవ్రంగా పరిగణించి, సమాలోచన చేయాలని సూచించారు.

"ప్రతిపక్షం లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యం లేకపోతే ఈ దేశమే ఉండదు. అలా జరిగితే దేశీయ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యమేలుతుంది" అని రౌత్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్​ పార్టీ మెల్కోవాలి

కీలకమైన సూరత్​లో కాంగ్రెస్​ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోవడం ఆశ్చర్యమన్నారు సంజయ్. మున్సిపల్​ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్​ఆద్మీపార్టీ(ఆప్​) 27 స్థానాలను కైవసం చేసుకుని.. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచిందని గుర్తు చేశారు. ఆప్ విజయాన్ని స్వాగతిస్తున్నామన్న రౌత్​.. పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్​ను గుజరాత్​ సహా ఇతర రాష్ట్రాల్లో ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారో పార్టీ అధిష్ఠానం ఆలోచించాలని హితవు పలికారు.

గుజరాత్​ స్థానిక ఎన్నికల్లో 576 స్థానాలకు గానూ భాజపా 483 స్థానాల్లో విజయభేరి మోగించగా.. కాంగ్రెస్​-55, ఆప్-27 స్థానాలకు పరిమితమయ్యాయి.​

భాజపాపై ధ్వజం

పుదుచ్చేరిలో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కూల్చడానికి భాజపా కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు రౌత్​. అధికారాన్ని, డబ్బును దుర్వియోగం చేయడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని ఇటువంటి వ్యూహాలనే భాజపా అనుసరించినప్పటికీ మహా వికాస్​ అఘాడీలోని మిత్రపక్షాలు ఎన్​సీపీ, కాంగ్రెస్​ సహా శివసేన తిప్పికొట్టాయన్నారు.

ఇదీ చూడండి: మొతేరాకు 'మోదీ స్టేడియం'గా నామకరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.