నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాలను సేకరించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు డిసెంబర్ 24న రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్టీ నాయకులు కోవింద్‌తో సమావేశం కానున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరనున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ..
నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతు కూలీలు, పెట్టుబడిదారుల నుంచి దాదాపు రెండు కోట్ల మంది సంతకాలను సేకరించామని వెల్లడించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా రైతులు నిరవధిక దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఉద్యమంలో భాగంగా ఇప్పటికే 44 మంది అన్నదాతలు ప్రాణాలొదిలారని తెలిపారు. కేంద్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ అధ్యక్షతన పంజాబ్, హరియాణాలో 'ట్రాక్టర్ ర్యాలీ'ని నిర్వహించామన్నారు.
ఇదీ చదవండి : రైతు సంఘాల నేతల కీలక భేటీ
ఇదీ చదవండి : 'ఈ చట్టాలు వ్యవసాయంలో కొత్త యుగానికి నాంది'