ETV Bharat / bharat

Mamata Vs Congress: టీఎంసీ, కాంగ్రెస్ ఫైట్- భాజపా సేఫ్​!

Congress Attack Mamata: 2022లో అతి కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు... 2024లో సార్వత్రిక ఎన్నికలు... అన్నింట్లో విజయమే లక్ష్యంగా ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది భాజపా. సామాజిక సమీకరణాలు, పొత్తుల లెక్కలు.. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ సరిచూసుకుంటూ తనదైన రాజకీయం సాగిస్తోంది. కానీ.. విపక్షాల పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం. కమలదళాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహ రచనలు, ఐక్యతా రాగాల గురించి పెద్దగా పట్టించుకోకుండా... పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ముఖ్యంగా.. విపక్షాల కూటమికి నేతృత్వం వహించడంపై కాంగ్రెస్, టీఎంసీ ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తున్నాయి. ఇంతకీ ఈ రాజకీయం ఎటు దారితీస్తుంది? భాజపాకు వరంగా మారుతుందా?

Congress to launch all-out attack against Mamata
దీదీపై కాంగ్రెస్​ గరం​గరం, Congress to launch all-out attack against Mamata, congress attack on mamata
author img

By

Published : Dec 2, 2021, 1:48 PM IST

Updated : Dec 2, 2021, 3:25 PM IST

Congress Attack Mamata

  • 'ప్రస్తుతానికి ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) అంటూ ఏమీ లేదు'.. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ను ముంబయిలో బుధవారం కలిసిన అనంతరం బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు.
  • కొద్ది రోజుల క్రితం మేఘాలయలో.. టీఎంసీలో చేరిన 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు​
  • పలు రాష్ట్రాల్లోనూ టీఎంసీ గూటికి కాంగ్రెస్​ నేతలు.

ఇలా వరుస షాక్​లతో కాంగ్రెస్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది టీఎంసీ. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఓడించేందుకు అన్ని పార్టీలను ఏకం చేయాలన్న కాంగ్రెస్​ లక్ష్యాలను.. పక్కా వ్యూహంతో నీరు గారుస్తున్నారు దీదీ.

ఇప్పుడు మమతపై మాటల దాడిని పెంచేందుకు కాంగ్రెస్​ సిద్ధమైంది. పార్టీ సీనియర్​ నాయకులను బరిలోకి దించాలని నిర్ణయించింది. యూపీఏ లేదన్న మమత వ్యాఖ్యలను కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీ కూడా తీవ్రంగా పరిగణించారని తెలుస్తోంది.

Mamata on Congress

2014లో భాజపా అధికారంలోకి రాకముందు.. పదేళ్లు కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏనే అధికారంలో ఉంది. తృణమూల్​ కాంగ్రెస్​ కూడా ఇందులో భాగమే.

కానీ.. ఇటీవల జరిగిన బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ​ జయభేరి మోగించింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో.. జాతీయ స్థాయిలో భాజపాకు బలమైన ప్రత్యామ్నాయం కావాలని, అది కాంగ్రెస్​ కాదని నొక్కిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు దీదీ.

2024 ఎన్నికల నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించడం లేదా ఒకే భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి బలం చేకూర్చే విధంగా.. ఇటీవల దిల్లీ కూడా వెళ్లారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్​ నాయకులతో సంప్రదింపులు జరిపారు. సోనియా గాంధీని మాత్రం కలవలేదు.

అంతకుముందు బంగాల్​లో గెలిసిన అనంతరం.. జులైలో చివరిసారి దిల్లీ వెళ్లినప్పుడు సోనియా, రాహుల్​ గాంధీని కలిశారు మమత.

ఇప్పుడు ముంబయి వెళ్లి ఎన్​సీపీ, శివసేన నాయకులతోనూ భేటీ అయ్యారు. ఈ సమయంలోనే కాంగ్రెస్​ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మమత.. యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించారు. 'రాజకీయాల్లో నిరంతర ప్రయత్నం అవసరం. ఎక్కువ సమయం విదేశాల్లో ఉండకూడదు' అంటూ రాహుల్​ గాంధీ పేరు ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు చేశారు.

అదే కాంగ్రెస్​కు కోపం తెప్పించింది. బుధవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించింది. మమతా బెనర్జీ లక్ష్యంగా మాటల దాడిని తీవ్రతరం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Adhir Ranjan on Mamata: తృణమూల్​ కాంగ్రెస్​ను విమర్శించడంలో బంగాల్​ కాంగ్రెస్ నేత అధిర్​ రంజన్​ చౌదరి ముందుంటారు. చాలా సార్లు మమతపై ఆరోపణలు చేశారు. బుధవారం కూడా మమత వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 'యూపీఏ అంటే మమతకు తెలియదా? మమతా బెనర్జీ.. కాంగ్రెస్​ను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు.​' అని విమర్శించారు. కాంగ్రెస్​ను బలహీనపర్చాలనుకునే టీఎంసీ వెనుక భాజపా ఉందని అన్నారు.

డిగ్గీ, ఖర్గేకు బాధ్యతలు..

ఇప్పుడు అధిర్​కు తోడు.. మమతపై రాజకీయ విమర్శలు చేసే బాధ్యతలను సీనియర్​ నేతలైన మల్లికార్జున్​ ఖర్గే, దిగ్విజయ్​ సింగ్​, రణ్​దీప్​ సుర్జేవాలాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్​ను వీడిన ఏపీ సీఎం జగన్​ మోహన్​ రెడ్డి, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్​ రావు, శరద్​ పవార్​తో సత్సంబంధాలున్నందునే దిగ్విజయ్​కు ఈ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే దిగ్విజయ్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ భాజపాతోనే తమ పోరాటం అని స్పష్టం చేశారు.

''భాజపాతోనే మా పోరు. మాతో కలవాలనుకునే వారు రావొచ్చు. ఇష్టం లేని వారు తమ పని చక్కగా చేసుకోవచ్చు. భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటయ్యే కూటమి.. కాంగ్రెస్​ లేకుండా ఉంటుందా?''

- దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

మమత వ్యాఖ్యలను కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​ కూడా తప్పుబట్టారు. కాంగ్రెస్​ లేని యూపీఏ.. ఆత్మ లేని శరీరం అని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

''మోదీని ఏ ప్రశ్న అయినా అడగండి. మిమ్మల్ని దేశ ద్రోహి అంటారు. మమతను అడిగితే మావోయిస్టు అంటారు. వీరిద్దరి మధ్య ఏంటి తేడా?''

- బీవీ శ్రీనివాస్​, యూత్​ కాంగ్రెస్​ చీఫ్​

Congress Leaders Join TMC: కాంగ్రెస్​కు టీఎంసీ నుంచి ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మేఘాలయలో మాజీ సీఎం ముకుల్​ సంగ్మా సహా 12 మంది పార్టీ ఎమ్మెల్యేలు తృణమూల్​లో చేరారు.

  • సెప్టెంబర్​లో గోవా మాజీ సీఎం లిజిన్హో ఫలేరో కూడా టీఎంసీలో చేరడం కాంగ్రెస్​కు పెద్ద షాకిచ్చింది. ఆ తర్వాత.. అదే పార్టీకి చెందిన మరో 9 మంది కీలక నేతలు ఫలేరో బాటలోనే నడిచారు.
  • అసోంలో మాజీ ఎంపీ, అఖిల భారత మహిళా కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సుస్మితా దేవ్​ కూడా ఆగస్టులో తృణమూల్​ గూటికి వెళ్లారు. ఆ తర్వాత ఫలేరో, సుస్మితాలకు టీఎంసీ నుంచి రాజ్యసభ సీట్లు దక్కడం విశేషం.
  • కీర్తి ఆజాద్​, హరియాణా కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు, రాహుల్​కు సన్నిహితుడు అశోక్​ తన్వార్​ కూడా ఇటీవల టీఎంసీలో చేరారు.

Prashant Kishor Attacks Congress: మమతా బెనర్జీ తర్వాత.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ కూడా కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. విపక్షాలకు నాయకత్వం వహించడం.. ఆ పార్టీకి దేవుడు ఇచ్చిన హక్కుగా కాంగ్రెస్​ భావిస్తుందని ఆరోపించారు. విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో వారే నిర్ణయించుకుంటారని ట్వీట్​ చేశారు.

2024 లోక్​సభ ఎన్నికలు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్​కు పెద్ద తలనొప్పిగా మారాయి. అదే టీఎంసీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్​పై దాడిని పెంచింది.

ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ముందు మమతా బెనర్జీని దీటుగా ఎదుర్కోవాలని భావించిన కాంగ్రెస్​ ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తోంది.

ఇవీ చూడండి: 'భాజపాకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు'

టీఎంసీ గురి భాజపాపై... దెబ్బలు మాత్రం కాంగ్రెస్​కు.. ఎందుకిలా?

Last Updated : Dec 2, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.