ETV Bharat / bharat

'2024లో గెలిచేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలి'.. స్టాలిన్​ బర్త్​డే వేడుకల్లో ఖర్గే - says Kharge Never said who will be PM

విభజన శక్తులపై పోరాడేందుకు భావ సారుప్యత కలిగిన పార్టీలన్ని కలిసి రావాలన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారో, ప్రధాని ఎవరు అవుతారో తానెప్పుడూ చెప్పలేదన్నారు. బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్​.. 70వ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరైన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఫరూక్​ అబ్దుల్లా, అఖిలేశ్​ యాదవ్​ సహా పలువురు నాయకులు హాజరయ్యారు.

mallikarjun kharge
ప్రతిపక్షాల ఐకమత్యానికి ఖర్గే పిలుపు
author img

By

Published : Mar 1, 2023, 10:20 PM IST

విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో తానేప్పుడు చెప్పలేదన్నారు కాంగ్రెస్ జాతీయ​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఈ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న.. అసలు ప్రశ్నే కాదన్నారు. 2024 పార్లమెంట్​ ఎన్నికలకు ముందు విభజన శక్తులపై పోరాడేందుకు విపక్షాలన్ని ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎమ్​కే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్​.. 70వ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరైన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు. అయినా బీజేపీ తన రాజకీయ లబ్ది కోసమే ప్రయత్నిస్తుందన్నారు. ఈ తరుణంలో దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

"విభజన శక్తులపై పోరాడేందుకు భావ సారుప్యత కలిగిన పార్టీలన్ని కలిసి రావాలి. ఎవరు కూటమికి నాయకత్వం వహిస్తారో, ఎవరు ప్రధాని అవుతారో నేనెప్పుడూ చెప్పలేదు. దానికి కాంగ్రెస్​ నాయకత్వం వహిస్తుందో, లేదో అని చెప్పడం లేదు. అది ప్రశ్నే కాదు. అందరం కలిసికట్టుగా పోరాడాలి అనుకుంటున్నాం. అదే మా కోరిక. అందుకే సెక్యులరిజం, స్వేచ్ఛ పేరుతో, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఎన్నోసార్లు త్యాగాలు చేశాం."అని ఖర్గే అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్ము కశ్మీర్​ నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు ఫరూక్​ అబ్దుల్లా.. స్టాలిన్​ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరారు. అందరు కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్​ ప్రధాని పదవి గురించి మరిచిపోవాలని ఆయన అన్నారు. 2024 లోక్​సభ ఎన్నికలపైనే ఆ పార్టీ దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమాజ్​వాది పార్టీ అధినేత, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి అఖిలేష్​ యాదవ్ సైతం స్టాలిన్​ను​ కొనియాడారు. ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా.. రాష్ట్ర​​ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

అనంతరం మాట్లాడిన డీఎమ్​కే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్​.. కాంగ్రెస్​ లేకుండా ప్రతిపక్షాల కూటమి వీలు కాదన్నారు. అలాంటి వాదనలు చేసే వారిని తిరస్కరించాలన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్​.. ఎన్నికల తరువాత పొత్తులు, మూడో ఫ్రంట్ ఆచరణాత్మకం కాదని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానికంటే, బీజీపీ అధికారాన్ని చేజిక్కించుకోకూడదనేదే ముఖ్యమైన అంశమన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.