Yogi Adityanath Birthday 111 Feet Cake: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆదివారం 51వ పడిలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు వివిధ రూపాల్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. నవాబ్‌గంజ్ అసెంబ్లీ పరిధి, సెంథాల్ పట్టణంలోని భాజపా కార్యకర్త అమీర్ జైదీ.. 111.6 అడుగుల ఎత్తైన కేక్‌ను తయారు చేయించి కట్ చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి చేసిన కృషికి గాను ఈ కేక్‌ను 'పీస్ ఆఫ్ కేక్'గా అమీర్ జైదీ అభివర్ణించారు. ప్రపంచరికార్డు సాధించాలన్న లక్ష్యంతో ఈ భారీ కేక్‌ను తయారు చేయించినట్లు పేర్కొన్నారు. 40 మంది సిబ్బంది కలిసి 40 క్వింటాళ్ల కేక్‌ను తయారు చేశారని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేక్‌ను తయారు చేయించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. మరోవైపు అయోధ్యలో 5 లక్షల మంది యోగి అభిమానులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

ఇవీ చదవండి: మంత్రి ఇంటిపై ఈడీ దాడులు.. మనీ లాండరింగ్ కేసులో కొత్త ఆధారాలు!
విరిగిన స్టీరింగ్.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 26 మంది మృతి