cm sankranti gift to kamalavva: నిలువ నీడలేక, సొంతింటి కోసం ఎదురు చూస్తున్న ఓ వృద్ధురాలి కలను సాకారం చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. భారీ వర్షాలతో ఇంటిని కోల్పోయిన ఆ అవ్వకు అండగా నిలిచారు. ఏకంగా పక్కా ఇల్లును నిర్మించి ఇచ్చి.. తన ఉదారతను చాటుకున్నారు. మకర సంక్రాంతి నాడు స్వయంగా ఆ వృద్ధరాలితో గృహ ప్రవేశం చేయించి.. జీవితాంతం గుర్తుండి పోయే కానుకను ఆమెకు ఇచ్చారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.
కర్ణాటక హవేరి జిల్లాలోని షిగ్గావిలో ఉండే కమలవ్వ సొంతిల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థ నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దీంతో కమలవ్వ ముఖ్యమంత్రి బొమ్మైతో మాట్లాడుతూ.. తన గోడును వెళ్లబోసుకుంది. తన కంటూ ఎవరూ లేరని చెప్పింది. ఉన్న ఇద్దరు కొడుకులు చనిపోయినట్లు పేర్కొంది. తాను తల దాచుకునేందుకు సొంత ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటూ.. కన్నీటి పర్యంతమైంది. ఆమె ఆవేదన విన్న సీఎం బసవరాజ్ బొమ్మై.. పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం కమలవ్వకు అన్ని వసతులు ఉన్న.. పక్కా ఇల్లును నిర్మించి ఇచ్చింది. హాలు, బెడ్‌రూమ్, స్టోర్‌రూమ్, వంటగది, పూజ గది ఉండే కొత్తింటికి సంబంధించిన తాళాలను మకర సంక్రాంతి నాడు కమలవ్వకు అందించారు అధికారులు.
ఇదీ చూడండి: 'బలవంతమేమీ లేదు.. నచ్చితేనే టీకా తీసుకోవచ్చు'