ETV Bharat / bharat

CRY Awareness: బాల కార్మిక వ్యవస్థపై 'చైల్డ్ రైట్స్ అండ్ యు' అవగాహన కార్యక్రమాలు - Awareness program BY CRY

CRY Awareness Program About Child Labour: బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా అగ్రస్థాయి భారతీయ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్​లోని ఐదు జిల్లాల్లో క్షేత్రస్థాయిలోని తన భాగస్వామ్య సంస్థలతో కలిసి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి సామూహిక నిబద్ధత, విశ్రాంత కృషి అవసరమమంటూ, ‘‘సంకల్పం, దృఢ చిత్తం కలిసినపుడు మార్పు సాధ్యమవుతుంది‘‘ అన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటనకు అనుగుణంగా, ఈ కార్యక్రమాలను చేపట్టింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 12, 2023, 3:12 PM IST

CRY Awareness Program About Child Labour: ఆంధ్రప్రదేశ్​లో ఇతర జిల్లాలతో పోల్చినపుడు బాల కార్మికులు అధికంగా ఉన్న ఐదు జిల్లాలు విశాఖపట్నం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​ కోనసీమ, కృష్ణా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 'చైల్డ్ రైట్స్ అండ్ యు' తన భాగస్వామ్య సంస్థలతో కలిసి జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ‘‘పిల్లలను పనిలో పెట్టుకోవటం ద్వారా వారికి సాయం చేయొద్దు’’ అనే నినాదంతో చైల్డ్ రైట్స్ అండ్ యు జాతీయ స్థాయిలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన కార్యాచరణను ప్రజలకు చేరవేయటానికి కృషి చేస్తోంది. ఇందుకోసం ఏడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో ప్రతి చిన్నారీ పనికి కాకుండా పాఠశాలకు వెళ్లేలా చూడటానికి స్థానిక, జిల్లా స్థాయి యంత్రాంగంతో కలిసి పని చేయటం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు చైల్డ్ రైట్స్ అండ్ యు తెలిపింది.

ఆందోళనకరంగా పరిస్థితి : బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో నిరంతర సమస్యగానే కొనసాగుతోంది. బాల కార్మికులపై యునిసెఫ్, అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన "చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్ 2020 ట్రెండ్స్ అండ్ ది రోడ్ ఫర్ ఫార్వర్డ్" ప్రకారం, "2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది చిన్నారులు (5 నుండి 17 సంవత్సరాల వయసు పిల్లలు) అందులో 6.3 కోట్ల మంది బాలికలు, 9.7 కోట్ల మంది బాలురు బాల కార్మికులుగా ఉన్నట్లు అంతర్జాతీయ అంచనాలు సూచిస్తున్నాయి’’ కాగా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న కిశోర బాలబాలికల సంఖ్య 11,86,285 గా ఉంది.

సమాచార కొరత : దేశ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ తాజా పరిస్థితులకు సంబంధించి, 2011 జనాభా లెక్కలు మినహా ఇటీవలి కాలంలో సేకరించిన అధికారిక సమాచారం కానీ, ప్రామాణిక సమాచారం కానీ అందుబాటులో లేదు. ఇది ప్రధాన అవరోధం. పైగా కరోనా మహమ్మారి అనంతరం బలవంతంగా కార్మికులుగా మారిన పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందని పలు అంచనాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమాచారం లేకపోవటం బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలనే లక్ష్య సాధనకు పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది.

ముందుకు సాగే మార్గం: ఇలాంటి పరిస్థితుల్లో బాలల సంరక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయాలి, నాణ్యమైన విద్య మరింతగా అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, పేదరికం నుంచి కుటుంబాలు, చిన్నారులు బయటపడేందుకు దోహదపడే సామాజిక మద్దతు వ్యవస్థలను పెంపొందించటం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల చిన్నారులను, వారి బాల్యాన్ని దోపిడీ చేసే విషవలయం అంతమవుతుంది" అని చైల్డ్ రైట్స్ అండ్ యు సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ వివరించారు.

వచ్చే 3 సంవత్సరాలలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ తన కార్యక్రమాలు అమలు చేస్తున్న 553 గ్రామాలను బాల కార్మిక రహిత గ్రామాలుగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు జాన్ రాబర్ట్స్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.