ETV Bharat / bharat

కీలక భేటీల రద్దు.. యడియూరప్ప రాజీనామా ఎప్పుడు? - కర్ణాటక భాజపా న్యూస్​

కర్ణాటక అధికార పార్టీలో నాయకత్వ మార్పుపై ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. జులై 26న జరగనున్న భాజపా శాసనసభాపక్ష భేటీలో ఓ స్పష్టత వస్తుందని అనుకున్నా.. ఆ సమావేశాన్ని రద్దు చేశారు సీఎం యడియూరప్ప. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో విందు కార్యక్రమాన్ని సైతం వాయిదా వేశారు. దీంతో సీఎం మార్పు ఊహాగానాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించటం లేదు.

Chief Minister BS Yeddyurappa
బీఎస్​ యడియూరప్ప
author img

By

Published : Jul 21, 2021, 8:08 PM IST

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించటం లేదు. భాజపా ప్రభుత్వ పగ్గాలు చేపట్టి జులై 26తో రెండేళ్లు పూర్తి అవుతుంది. ఈ క్రమంలోనే పార్టీ విజయోత్సవ కార్యక్రమం వేదికగానే సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అందులో భాగంగానే.. జులై 25న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విందు, 26న పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారని అంతా అనుకున్నారు. అయితే.. తాజాగా ఈ రెండు కార్యక్రమాలను వాయిదా వేశారు యడియూరప్ప.

పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విందు కార్యక్రమం మరోరోజు నిర్వహించనున్నట్లు యడియూరప్ప సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమ ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. జులై 27న లేదా.. ఆ తర్వాత ఏప్పుడైనా నిర్వహించే వీలుందని తెలిపారు.

ఇటీవలే దిల్లీ వెళ్లిన.. యడియూరప్ప.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిపై పార్టీ కరసత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే.. దిల్లీ నుంచి తిరిగొచ్చాక..అలాంటి వాదనలు తిప్పికొట్టారు యడ్డీ. తననే కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లు చెప్పుకొచ్చారు.

కుమారుడి కోసం?

మరోవైపు.. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప స్వచ్ఛందంగా వీడ్కోలు పలకనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయనపై భాజపా హైకమాండ్​ ఒత్తిడి లేదని తెలిపాయి.

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఏడాది కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు యడియూరప్ప. తాను పూర్తి పదవీకాలం కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ఇటీవల దిల్లీ పర్యటన తర్వాత.. సీఎం మార్పుపై మరింత ప్రచారం జరుగుతోంది. వయస్సు, ఆరోగ్య సమస్యలతో బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాని, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోకోణంలో.. ఆయన కుమారుడు, భాజపా కర్ణాటక ఉపాధ్యక్షుడు విజయేంద్ర.. రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రెండేళ్లైనా రాష్ట్రానికి నేనే సీఎం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.