ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలోని గుమల్నార్ అడవుల్లో సోమవారం ఉదయం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా నక్సలైట్ వైకో పెక్కో(24) మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. ఆమెపై గతంలో రూ.2 లక్షల రివార్డు ఉందన్నారు.
ఘటనాస్థలంలో 2 కిలోల పేలుడు పదార్థాలు, 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి : ఆ లేఖపై ఉల్ఫా అనుమానాలు!