ETV Bharat / bharat

Punjab CM News: చదువుల్లో దిట్ట- జ్యోతిషంపై అపార నమ్మకం!

పంజాబ్​ ముఖ్యమంత్రిగా(Punjab CM News) ప్రమాణ స్వీకారం చేశారు చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. అమరీందర్​ సింగ్​ రాజీనామా తర్వాత.. సీఎం రేసులో పలువురు నేతల పేర్లు వినిపించినప్పటికీ చన్నీ వైపే మొగ్గుచూపింది కాంగ్రెస్​ అధిష్ఠానం. ఉన్నత విద్యావంతుడైన చన్నీ.. రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.

Punjab's new CM
పంజాబ్​ సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ
author img

By

Published : Sep 20, 2021, 2:03 PM IST

పంజాబ్​ నూతన ముఖ్యమంత్రిగా(punjab cm name) ప్రమాణ స్వీకారం చేశారు సిక్కు-దళిత నాయకుడు చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. రాష్ట్ర చరిత్రలో దళిత వర్గానికి చెందిన తొలి సీఎంగా గుర్తింపు పొందారు. 58 ఏళ్ల చన్నీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉన్నత విద్యావంతుడు, క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.

కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ రాజీనామా చేసిన క్రమంలో తదుపరి ముఖ్యమంత్రిగా చరణ్​జీత్​ సింగ్​ను(Charanjit singh channi) కాంగ్రెస్​ అధిష్ఠానం ఎంపిక చేసింది. కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే (punjab assembly elections) లక్ష్యంగా చన్నీకి సీఎం పదవి కట్టబెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం..

పంజాబ్​ సాహిబ్జాదా అజిత్​ సింగ్​ నగర్​ జిల్లాలోని భాజులి గ్రామంలో 1963, మార్చి 1న జన్మించారు చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. ఖరార్​లోని ఖాల్సా సీనియర్​ సెకండరీ పాఠశాలలో చదివారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయ జీవితానికి బీజం పడిందని చెప్పాలి. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. ఛండీగఢ్​లోని శ్రీ గురు గోవింద్​ సింగ్​ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ కళాశాలలోనూ స్టూడెంట్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పీజీలో రెండు డిగ్రీలు సాధించారు. ఒకటి బిజినెస్​ అడ్మినిస్ట్రేటర్​, మరొకటి పొలిటికల్​ సైన్స్​లో పూర్తి చేశారు.

కౌన్సిలర్​గా ఎన్నికైన సమయంలోనే పంజాబ్​ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు చన్నీ. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. పంజాబ్​ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం పంజాబ్​ వర్సిటీ నుంచి పొలిటికల్​ సైన్స్​ విభాగంలో ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​పై పీహెచ్​డీ చేస్తున్నట్లు సమాచారం.

రాజకీయ ప్రస్థానం..

మున్సిపల్​ కౌన్సిలర్​గా ఎన్నికై.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు చన్నీ. వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఖరార్​ మున్సిపల్​ కౌన్సిల్​కు రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు. 2007లో, ఛంకౌర్​ సాహిబ్​ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్​ అభ్యర్థిపై పోటీ చేశారు చన్నీ. మూడేళ్ల తర్వాత కెప్టెన్​ అమరీందర్​ సింగ్​.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

ఆ తర్వాత 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. 2016లో కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేతగానూ(సీఎల్​పీ) సేవలందించారు.

2015లో, పీపీసీసీ అధ్యక్షుడు ప్రతాప్​ సింగ్​ బజ్వాను తొలగించాలని కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ తిరుగుబాటు చేసినప్పటికీ.. చన్నీ ఆయనతో వెళ్లకుండా తటస్థంగా ఉండిపోయారు. ఈ కారణంగానే 14వ శాసనసభకు ప్రతిపక్ష నేతగా చన్నీని ఎంపిక చేసింది కాంగ్రెస్​ అధిష్ఠానం. 2017, అమరీందర్​ ప్రభుత్వంలో.. సాంకేతిక విద్య, ఇండస్ట్రియల్​ ట్రైనింగ్​, ఉపాధి కల్పన, సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖల మంత్రిగా సేవలందించారు.

హ్యాండ్​ బాల్​ క్రీడలో..

చదువులో పలు డిగ్రీలు సాధించిన చన్నీకి.. హ్యాండ్​బాల్​ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు ఉంది. పంజాబ్​ వర్సిటీ తరఫున చాలా పోటీల్లో పాల్గొన్నారు ఆయన.

మీటూ ఉద్యమం..

2018లో మీటూ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో.. ఓ మహిళా ఐఏఎస్​ అధికారిని తనకు అసభ్యకర సందేశాలు పంపారని చన్నీపై ఆరోపణలు చేశారు. అయితే.. చన్నీపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాష్ట్ర మహిళా విభాగం స్పష్టం చేసింది. అయితే.. రెండేళ్ల తర్వాత కెప్టెన్​ అమరీందర్​పై తిరుగుబాటు చేసిన క్రమంలో మీటూ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కానీ, సీఎం జోక్యంతో వల్ల సద్దుమణిగింది.

ఇదీ చూడండి: Punjab CM News: పంజాబ్ కొత్త సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ

పంజాబ్​ సీఎంగా చన్నీ ప్రమాణం

2022 ఎన్నికలకు కాంగ్రెస్ స్కెచ్- అందుకే చరణ్​జీత్!

పంజాబ్​ 'మార్పు'తో.. కాంగ్రెస్​ అధిష్ఠానం చెప్పాలనుకునేది ఇదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.