Chandrababu Bail Cancellation Petition Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరి 19వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై గతంలో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను ఈ రోజుకి వాయిదా వేసింది.
జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ చేపట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 17ఎ వ్యవహారంపై తీర్పును ఇప్పటికీ వెలువరించలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్కిల్ కేసుకు సంబంధించి 17ఎ వ్యవహారంపై తీర్పును ఇచ్చేట్లయితే వాయిదా వేయాలని లేదంటే విచారణ తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టును కోరారు.
చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు సీఐడీ
నోటీసులు జారీ చేసినా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హరీష్ సాల్వే కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కానీ అదే సమయంలో ఈ అంశం 17ఎ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.
సాల్వే వాదనతో ఏకీభవించిన జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం జనవరి మూడో వారంలో విచారణను చేపడతామని తెలిపింది. అయితే ఏదో ఒక తేదీని ఖరారు చేయాలన్న హరీష సాల్వే విజ్ఞప్తితో జనవరి 19వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. జనవరి 19వ తేదీ లోపు కౌంటర్ వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించింది. అదే విధంగా దానికి రిజాయిండర్ పిటిష దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు
Chandrababu Quash Petition in Supreme Court: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే వాదనలు పూర్తికాగా, ఇప్పటికీ తీర్పును వెలువరించలేదు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తి కావడంతో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. 17ఏ సెక్షన్‌తో కేసు ముడిపడి ఉన్నందున ఈ తీర్పు చాలా కీలకం కానుంది. మరికొద్ది రోజులలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పుతోనే చంద్రబాబు ఇతర కేసుల భవితవ్యం కూడా తేలిపోనుంది.
'ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు' చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా