కరోనా రోగులకు అందించే ఔషధాల్లో రెమ్‌డెసివిర్ ప్రధానమైనది. దీన్ని అందించేందుకు పంజాబ్ చండీగడ్‌కు చెందిన ఓ యువకుడు ఏకంగా రాజస్థాన్‌కు వెళ్లాడు. అలా.. 420 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి చండీగడ్ నుంచి అల్వర్(రాజస్థాన్)కు చేరుకున్నాడు.
420 కి.మీ. - 8 గంటలు
పంజాబ్ వాసి అర్జున్ బాలీ, రాజస్థాన్‌కు చెందిన సాహిల్ సింగ్ రాథోడ్ స్నేహితులు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. సాహిల్ తల్లి ఇటీవల కొవిడ్ బారినపడ్డారు. ఆమె ఆక్సిజన్ స్థాయి 84కు పడిపోయి ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ వేయాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సాహిల్ దాని కోసం అల్వర్ అంతా తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మిత్రుడు అర్జున్‌కు విషయం చెప్పి.. రెమ్‌డెసివిర్, ఇతర ఔషధాలను ఏర్పాటు చేయమని కోరాడు. సమాచారం అందగానే తక్షణమే స్పందించిన అర్జున్.. సాహిల్ సూచించిన ఔషధాలు తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా బైక్‌పైనే బయల్దేరాడు. అలా.. సుమారు 420 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం 8 గంటల్లోనే అల్వర్‌కు చేరుకున్నాడు.
సాహిల్ తల్లిని కాపాడటం తన బాధ్యత అని విశ్వసించిన అర్జున్.. కొవిడ్‌పై పోరాటంలో ఆమె తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
జిల్లా అధ్యక్షులు మెచ్చి..
తన మిత్రుడి కోసం అర్జున్ చేసిన అసాధారణ సాయం గురించి తెలుసుకుని.. భాజపా జిల్లా అధినేత సంజయ్ నరుకా, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జితేంద్ర రాఠోడ్ అతణ్ని ప్రశంసించారు. అర్జున్‌కు పూలమాలలు వేసి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: సీఎం పర్యటనకు రైతుల సెగ- పోలీసుల లాఠీఛార్జ్