Chain Snatcher on Flight: విమానాలలో వచ్చి చోరీలకు పాల్పడుతున్న గొలుసుల దొంగను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన ఉమేశ్ ఖాటిక్గా గుర్తించారు. బెంగళూరులో ఇదివరకు బైక్‌లను చోరీ చేసేవాడు ఉమేశ్. దొంగలించిన బైక్‌లపై తిరుగుతూ.. రోడ్లపై వెళ్లే మహిళల మెడలో నుంచి గొలుసులు కొట్టేసేవాడు. దొంగతనం చేసిన తర్వాత రాజస్థాన్‌లోని తన సొంతూరికి రైలులో వెళ్లేవాడు. అక్కడ తన భార్యకు అన్ని సౌకర్యాలు సమకూర్చేవాడు.
గతేడాది బెంగళూరులో దొంగతనాలు చేసి.. మకాం హైదరాబాద్‌కు మార్చాడు. అక్కడ చోరీలు ప్రారంభించాడు. ఇతడిపై రాజస్థాన్‌లో 18, హైదరాబాద్‌లో ఏడు, బెంగళూరులో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇటీవల తిరిగి బెంగళూరుకు వచ్చి.. మారతహళ్లి, పుట్టెనహళ్లి, సీకే అచికట్టు పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో మూడు గొలుసులను కొట్టేశాడు ఉమేశ్.
Chain snatching for wife: మైనర్‌గా ఉన్న సమయంలోనే తన భార్యను వివాహం చేసుకున్నాడు నిందితుడు. దీనిపై కేసు నమోదు కాగా.. జైలుకు వెళ్లి వచ్చాడు. శిక్ష పూర్తైన తర్వాత మళ్లీ ఆమెను వివాహమాడాడు. భార్యను పోషించుకునేందుకే దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు.
ఇదీ చదవండి: పబ్జీ దోస్త్ కోసం 'రైలులో బాంబ్'.. పోలీసులు హడల్