ETV Bharat / bharat

'రెమ్​డెసివిర్​ను ఆస్పత్రులే ఇవ్వాలి' - remdesivir usage in india

కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ను ఆసుపత్రులే ఇవ్వాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. బయట రిటైల్‌ మార్కెట్‌ నుంచి తెచ్చుకోమని చెప్పకూడదని స్పష్టం చేసింది. సీనియర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌ కానీ, స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మాత్రమే ప్రతిపాదించాలని సూచించింది.

remdesivir
రెమ్‌డెసివిర్‌
author img

By

Published : Jun 8, 2021, 5:19 AM IST

కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగంపై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రోగులకు రెమ్‌డెసివిర్‌ను ఆసుపత్రులే ఇవ్వాలని బయట రిటైల్‌ మార్కెట్‌ నుంచి తెచ్చుకోమని రోగులు, వారి సహాయకులకు చెప్పకూడదని స్పష్టం చేసింది. రోగికి వైద్యసేవలు అందించడంలో నిమగ్నమైన సీనియర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌కానీ.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మాత్రమే రెమ్‌డెసివిర్‌ను ప్రతిపాదించాలని స్పష్టం చేసింది.

కేంద్రం మార్గదర్శకాలు..

  • వేళకాని వేళల్లో రెమ్‌డెసివిర్‌ను రోగికి అందించాలని సూచించినప్పుడు డ్యూటీ డాక్టర్‌ సీనియర్‌ డాక్టర్‌తో ఫోన్‌లో సంప్రదించిన తర్వాతే ఇవ్వాలి. ఈ మందును ప్రతిపాదించిన డాక్టర్‌ సదరు ప్రిస్క్రిప్షన్‌ మీద పేరు, సంతకం, స్టాంప్‌ తప్పనిసరిగా వేయాలి.
  • ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్‌ వినియోగం గురించి ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా స్పెషల్‌ డ్రగ్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో వీలైనచోట ఫార్మకాలజీ ప్రొఫెసర్‌ను ఒక సభ్యుడిగా నియమించాలి.
  • ఈ కమిటీ తమ అధ్యయనంలో తేలిన అంశాలను వైద్యసేవలు అందించే డాక్టర్లతో పంచుకొని రెమ్‌డెసివిర్‌ను హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా ఉపయోగించేలా సూచనలు జారీచేయాలి.
  • రెమ్‌డెసివిర్‌ను కేవలం మధ్యస్థాయి, తీవ్రమైన లక్షణాలతో ఆక్సిజన్‌పై ఉన్న రోగుల్లో ఎంపికచేసిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అత్యవసర వినియోగం కోసం అనుమతిచ్చిన ఒక రిజర్వ్‌ డ్రగ్‌ మాత్రమే.
  • హోమ్ఐసోలేషన్ లేదా కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్న తేలికపాటి లక్షణాలున్న వారికి రెమ్‌డెసివిర్‌ ప్రతిపాదించకూడదు.
  • వైద్యులు రెమ్‌డెసివిర్‌ దుర్వినియోగాన్ని ఆపాలి. అధిక ధర, తక్కువ లభ్యత ఉన్న ఈ మందును ఇష్టానుసారం ప్రతిపాదించకూడదు. దానివల్ల నష్టాలుంటాయి.
  • రెమ్‌డెసివిర్ మరణాలను ఆపకపోయినా 94 శాతం లోపు ఆక్సిజన్‌ స్థాయి ఉన్న రోగులకు 7 నుంచి 10 రోజుల మధ్యలో దీన్ని ఇచ్చినప్పుడు తొందరగా కోలుకుంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
  • సాధారణ రోగులు 15 రోజుల్లో కోలుకుంటే ఇది ఇచ్చిన వారు 10 రోజుల్లోనే కోలుకుంటున్నట్లు అధ్యయనాలున్నాయి. అలాగే ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం 17 నుంచి 12 రోగులకు తగ్గినట్లు వెల్లడైంది. కానీ మరణాలను అరికట్టడంలో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు.

2020 డిసెంబర్‌లో డబ్ల్యూహెచ్​ఓ ప్రచురించిన సాలిడారిటీ ట్రయల్‌ నివేదికలో మాత్రం ఆసుపత్రుల్లో చేరిన రోగులపై రెమ్‌డెసివిర్‌ పెద్దగా ప్రభావం చూపలేదని తేలింది. మరణాలుకానీ, వెంటిలేషన్‌ వరకు వెళ్లకుండా అడ్డుకోవడం కానీ, ఆసుపత్రల్లో ఉండాల్సిన రోజులు కానీ దీనివల్ల తగ్గలేదన్న విషయం వెల్లడైందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇదీ చదవండి : మోదీ ప్రసంగం- టాప్​ టెన్​ హైలైట్స్​

'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.