ETV Bharat / bharat

'టీకాల సమర్థతపై ఆందోళన అనవసరం'

కొవిడ్​ వ్యాక్సిన్​ కొవిషీల్డ్​పై ఆందోళనలు అనవసరమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ టీకా సురక్షితమేనని, సమర్థత మీద సందేహాలు వద్దని పేర్కొంది. భారత్​లో వాడుతున్న రెండు టీకాలు.. యూకే, బ్రెజిల్​ రకాల వైరస్​పైనా సమర్థంగానే పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

Centre allays concerns on Covishield
'టీకాల సమర్థతపై ఆందోళన అనవసరం'
author img

By

Published : Mar 25, 2021, 5:31 AM IST

కరోనా నివారణ వ్యాక్సిన్లలో ఒకటైన కొవిషీల్డ్ సురక్షితమైనదేనని, ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం సృష్టం చేసింది. ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా రూపొందించిన ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు పడతాయనే ఉద్దేశంతో కొన్ని ఐరోపా దేశాలు దీని వినియోగాన్ని నిలిపివేశాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికార వర్గాలు ఈ భరోసాను ఇచ్చాయి.

ఈ వ్యాక్సిన్​ను తీసుకున్నవారికి వారికి రక్తం గడ్డకట్టుకుపోతున్నట్లు కొన్ని దేశాల్లో అనుమానిస్తున్నా అలాంటి ముప్పు ఏమీ ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్.. బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వాడుతున్న కొవాగ్జిన్​, కొవిషీల్డ్ టీకాలు యూకే, బ్రెజిల్ రకాల వైరస్​పైనా సమర్థంగా పనిచేస్తాయని, అది శాస్త్రీయ అధ్యయనాల్లో రుజువైందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు.

దక్షిణాఫ్రికా రకం వైరస్​పై మన వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయనే పరిశోధన ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. వీటి సమర్థతపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ప్రజల్ని కోరారు. పాత, కొత్త రకాల వైరస్​లు రెండింటిపైనా మన వ్యాక్సిన్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయని చెప్పారు. కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రెండో విడత విజృంభణను అడ్డుకునేందుకు టీకాను ఒక సాధనంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: ఆస్ట్రాజెనెకా టీకా ఫలితాల్లో 'పాత డేటా'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.