కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి.. కేంద్రం సెంట్రల్ విస్టా పనులపై ధ్యాసపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు. ఇది ఓ అపరాధం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
-
Central Vista is criminal wastage.
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Put people’s lives at the centre- not your blind arrogance to get a new house!
">Central Vista is criminal wastage.
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2021
Put people’s lives at the centre- not your blind arrogance to get a new house!Central Vista is criminal wastage.
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2021
Put people’s lives at the centre- not your blind arrogance to get a new house!
"ఈ పరిస్థితుల్లో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పెద్ద నేరం. కేంద్రం.. కొత్త పార్లమెంట్ భవనం కోసం ఆరాటపడటం కాదు, ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
ప్రస్తుతం వైద్య అవసరాలపై దృష్టి పెట్టి.. ప్రజలను కాపాడే దిశగా కేంద్రం నడవాలని కాంగ్రెస్ మొదటినుంచి చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యత వహించరేం?
దేశంలో కొవిడ్ పరిస్థితి రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ప్రధాని మోదీ, ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్.. పరిస్థితులపై బాధ్యత వహించాల్సింది పోయి చేతులెత్తేశారని ఆరోపించారు. వ్యాక్సిన్ కొరత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదని అన్నారు.
దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో చిదంబరం ఈ విధంగా ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:కొవిడ్ విజేతలపై 'బ్లాక్ ఫంగస్' పంజా..!