ETV Bharat / bharat

'పెట్రోల్​, డీజిల్​పై పన్ను వసూళ్లు 300% వృద్ధి' - 'అంతర్జాతీయ చమురు ధరల్లో హెచ్చుతగ్గులు

ఎక్సైజ్​ సుంకం పెరగడం వల్ల గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను వసూళ్లు 300శాతానికి పైగా పెరిగాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ లోక్​సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Central govt's tax collection on petrol, diesel jumps 300% in six years
గత ఆరేళ్లలో పెట్రోల్​, డీజిల్​పై 300శాతం పన్నులు!
author img

By

Published : Mar 22, 2021, 7:31 PM IST

Updated : Mar 22, 2021, 7:45 PM IST

ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల దేశంలో పెట్రోల్​, డీజిల్​ రేట్లు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ పెట్రోల్​, డీజిల్​పై పన్ను వసూళ్లు 300శాతానికి పైగా పెరిగాయని లోక్​సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.

2014-15లో పెట్రోల్‌పై రూ.29,279 కోట్లు, డీజిల్‌పై రూ.42,881 కోట్లు ఎక్సైజ్ సుంకం వసూలు చేసింది కేంద్రం. సహజ వాయువుపై విధించిన ఎక్సైజ్ సుంకంతో కలిపి 2014-15లో రూ.74,158 కోట్లు వసూలు చేయగా.. ఇది 2020 ఏప్రిల్-2021 జనవరి నాటికి రూ.2.95 లక్షల కోట్లకు పెరిగింది.

''అంతర్జాతీయ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ఎక్సైజ్ సుంకం తోడ్పడుతోంది. ఇది ముందే నిర్దేశించినది. ప్రస్తుత ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఇది తప్పదు.''

-అనురాగ్​ ఠాకూర్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి.

మొత్తం పన్ను రాబడిలో ఇంధనంపై విధించిన పన్నుల వాటా 2014-15లో 5.4శాతం ఉండగా.. 2020-21 నాటికి అది 12.2శాతానికి పెరిగిందని ఠాకూర్​ తెలిపారు.

2014లో లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.9.48 ఉండగా.. ప్రస్తుతం రూ.32.9కు పెరిగింది. ఇక డీజిల్‌పై రూ.3.56 నుంచి రూ.31.80కి పెరిగింది.

దిల్లీలో రిటైల్​గా లీటరు పెట్రోల్​ ధర రూ.91.17 ఉంటే దీనిలో 60 శాతాన్ని వివిధ రకాల పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'రాష్ట్రాలు కలిసొస్తే జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్!'

Last Updated : Mar 22, 2021, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.