వచ్చే లోక్సభ ఎన్నికలనాటికి 'రిమోట్ ఓటింగ్' విధానం కార్యరూపం దాల్చుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా ఆశాభావం వ్యక్తం చేశారు.
దీనిపై రెండు, మూడు నెలల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని వెల్లడించారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రిమోట్ ఓటింగ్ విధానంపై ఈ ఏడాదే పరిశోధన ప్రారంభించినట్లు చెప్పారు. తమ బృందం కొద్ది నెలలుగా ఈ ప్రాజెక్టు కోసం అంకితభావంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.వివిధ ఐఐటీలు, ఇతర సంస్థలకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ రిమోట్ ఓటింగ్ అంటే ఇంటర్నెట్ ఆధారిత ఓటింగ్, ఓట్ ఫ్రం హోం వంటిది కాదని నొక్కిచెప్పాల్సిన అవసరం ఉన్నట్లు అరోడా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: