Car Fell in Chambal River: రాజస్థాన్‌లోని కోట వద్ద జరిగిన కారు ప్రమాదంలో.. వరుడు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులు వివాహ వేడుకకు ఉజ్జయినికి వెళ్తుండగా.. కోట సమీపంలోని కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి చంబల్ నదిలో పడిపోయింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో నదిలో పడిపోయిన కారును బయటకుతీశారు.
కారులో 9 మృతదేహాలు ఉన్నట్లు సహాయ సిబ్బంది చెప్పారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పెళ్లికుమారుడు కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పెద్దలను ఎదిరించి పెళ్లి.. 10 రోజులకే సూసైడ్..