ETV Bharat / bharat

'కొవాగ్జిన్ తీసుకున్న వారికి కొవిషీల్డ్ ఇవ్వమని చెప్పలేం'

కొవాగ్జిన్ టీకా తీసుకుని విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మళ్లీ కొవిషీల్డ్(Covishield Vaccine News) టీకా అందించాలన్న పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ అందించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చి.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

vaccine
వ్యాక్సినేషన్
author img

By

Published : Oct 29, 2021, 8:36 PM IST

కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారికి మరోసారి కొవిషీల్డ్(Covishield Vaccine News) వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించి ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొవాగ్జిన్(Covaxin Who Approval) టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతి లేకపోవటం వల్ల విదేశాలకు వెళ్లేందుకు భారత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన పిటిషన్​పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రజలకు మరోసారి వ్యాక్సినేషన్ అందించటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తమ దగ్గర సమాచారం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్​ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

" ప్రజలకు మరోసారి వ్యాక్సినేషన్ అందించమని కేంద్రాన్ని ఆదేశించి ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పెట్టలేం. వ్యాక్సినేషన్​కు సంబంధించి మావద్ద ఎలాంటి సమాచారం లేదు. డబ్ల్యూహెచ్​ఓ అనుమతి కోసం భారత్ బయోటెక్ సంస్థ దరఖాస్తు చేసుకున్నట్లు పత్రికల్లో చదివాం. అందువల్ల డబ్యూహెచ్​ఓ సమాధానం కోసం వేచిచూద్దాం. ఇదే విషయంపై దీపావళి తర్వాత చర్చిస్తాం."

-- సుప్రీంకోర్టు ధర్మాసనం

పిటిషనర్ తరఫున వాదించిన అడ్వకేట్ కార్తిక్ సేత్​.. ప్రతిరోజు కొంతమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, కొవాగ్జిన్(Covaxin Who Approval) టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించనందున విద్యార్థులు నిరాకరణకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ప్రజల మేలుకే ప్రభుత్వానికి అధికారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.