బిహార్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌కు యత్నించారు ఇద్దరు అభ్యర్థులు. భభువాలోని పరీక్షా కేంద్రానికి వారు మాస్కుల్లో బ్లూటూత్ పరికరాలను తీసుకొచ్చారు. వారికి బయటే ఉన్న ముగ్గరు వ్యక్తులు సహకారం అందించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీల్లో వీరి మోసం పడింది. దీంతో వారిపై కేసు నమోదైంది.
మరో కేంద్రంలో చొక్కాలో జవాబుపత్రాలను తీసుకొచ్చిన అభ్యర్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ వ్యవహారంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఒకరు తప్పించుకున్నారు.
ఇదీ చూడండి: బంగాల్లో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి