ETV Bharat / bharat

'వారిని 'బయటి వ్యక్తులు' అనటం రాజ్యాంగ విరుద్ధం'

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకొని పరోక్ష విమర్శలు చేశారు ఆ రాష్ట్ర గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​. దేశంలోని ఇతర ప్రాంతాల వారిని 'బయటి వ్యక్తులు'గా భావిచటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అలా అనుకునేవారిని భారత రాజ్యాంగం చదవాలని కోరారు.

Jagdeep Dhankar
గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్
author img

By

Published : Dec 22, 2020, 4:58 AM IST

దేశంలోని ఇతర ప్రాంతాల వ్యక్తులను 'బయటి వారు'గా సంబోధించటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 'ఎన్నికల సమయంలో వచ్చి హింసను ప్రేరేపించే బయటి వ్యక్తులకు రాష్ట్రంలో స్థానం లేదు' అని పేర్కొనటాన్ని సూచిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"ఏ కారణం చేత దేశంలోని ఇతర ప్రాంత వ్యక్తులను బయటి వారిగా పరిగణిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఈ సంస్కృతి రాజ్యాంగ విరుద్ధం. అలా మాట్లాడాలనుకునే వారిని భారత రాజ్యాంగం చదవాలని కోరాలనుకుంటున్నా. రాజ్యాంగాన్ని రక్షించటం గవర్నర్​ బాధ్యత. రాష్ట్ర రాజకీయాలతో ప్రేరేపితమై ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు రాష్ట్ర పోలీసులు, అధికారులు. అది ప్రజాస్వామ్యం, చట్టాలకు చాలా పెద్ద ప్రమాదం. రాజకీయాల కోసం ప్రత్యర్థులపై దాడులు చేయొద్దు."

- జగ్​దీప్​ ధన్​కర్​, బంగాల్ గవర్నర్​

సువేందు అధికారి.. అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు రాజీనామా చేసి భాజపాలో చేరతారని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు గవర్నర్​. రాజకీయ నిర్ణయాల కారణంగా అతను, అతని సహచరులు క్రిమినల్​ కేసుల్లో చిక్కుకోవచ్చని చెబుతూ లేఖ రాస్తానని తెలిపారు. చాలా కాలంగా ముఖ్యమంత్రితో సువేందు కలిసి పనిచేశారని గుర్తు చేశారు. పోలీసులు, అధికారులు తనను క్రిమినల్​ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారంటూ సువేందు తనకు లేఖ రాస్తారని అనుకోలేదన్నారు.

నవంబర్​ 26 బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియా సమావేశంలో దిల్లీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేవలం ఎన్నికల సమయంలో వచ్చి హింసను ప్రేరేపించే బయటివారికి బంగాల్​లో స్థానం లేదు. ఈ రాష్ట్రం బయటివారి కోసం కాదు. వారు కేవలం ఎన్నికల్లో రాజకీయాలు చేసేందుకు వస్తున్నారు.' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఎన్నికల నాటికి టీఎంసీలో దీదీ ఒక్కరే: షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.