ETV Bharat / bharat

ఆకాశ్ క్షిపణి ఎగుమతికి కేబినెట్ పచ్చజెండా - Cabinet chaired by PM Modi today approved the export of Akash Missile System

ఆకాశ్ క్షిపణి వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు సత్వర ఆమోదం తెలిపేలా కమిటీని ఏర్పాటు చేసింది.

Cabinet chaired by PM Modi today approved the export of Akash Missile System
ఆకాశ్ క్షిపణి ఎగుమతికి కేంద్రం పచ్చజెండా
author img

By

Published : Dec 30, 2020, 2:47 PM IST

ఆకాశ్ క్షిపణి వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. క్షిపణి వ్యవస్థ కోసం ఇతర దేశాలు చేసుకొనే దరఖాస్తులను పరిశీలించి.. సత్వర అనుమతులను ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే విదేశాలకు ఎగుమతి చేసే ఆకాశ్ వెర్షన్ ప్రస్తుతం భారత దళాలు ఉపయోగిస్తున్నదానితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. 5 బిలియన్ డాలర్ల ఆయుధాల ఎగుమతే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు స్నేహపూర్వక దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని యత్నిస్తున్నట్లు చెప్పారు.

స్వదేశంలో తయారైన ఈ క్షిపణులు భారత అమ్ములపొదిలో కీలకంగా ఉన్నాయి. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.

ఇదీ చదవండి: చైనాకు దడ పుట్టేలా 'ఆకాశ్'​ మిసైల్స్​ పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.