జమ్ముకశ్మీర్ ఉధంపుర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రామ్‌నగర్ సమీపంలోని కియా గ్రామం వద్ద ఓ బస్సు 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం రామ్‌నగర్‌కు తరలించామని తెలిపారు.


