ETV Bharat / bharat

Budget Session 2022: లోక్​సభ రేపటికి వాయిదా

BUDGET 2022
బడ్జెట్ సమావేశాలు 2022
author img

By

Published : Jan 31, 2022, 10:31 AM IST

Updated : Jan 31, 2022, 12:52 PM IST

12:51 January 31

లోక్​సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు పార్లమెంట్​లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

12:05 January 31

బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఏడాది వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించారు. వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో సాధించిన విజయాన్ని ప్రస్తావించారు. ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే 150కోట్ల వ్యాక్సినేషన్లను వేయగలిగామన్నారు. పీఎం ఆయుష్మాన్ భారత్ పథకం కింద మౌలిక వసతుల కోసం రూ. 64వేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో వచ్చే వైద్య పరమైన సంక్షోభాన్ని అధిగమించేందుకు సన్నద్ధమవుతోందన్నారు.

కరోనాపై భారత్ పోరాటం, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్​ భారత్​, ఎంఎస్​ఎంఈ రంగం, రోడ్ల నిర్మాణం.. తదితర విభాగాల్లో కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను రాష్ట్రపతి పేర్కొన్నారు.

11:53 January 31

  • పీఎం కిసాన్‌ ద్వారా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం: రాష్ట్రపతి
  • రైతు కుటుంబాలకు రూ.1.80 లక్షల కోట్లు పొందారు: రాష్ట్రపతి
  • గతేడాది కాలంలో 24 వేల కి.మీ. మేర రైల్వే లైను నిర్మాణాలు: రాష్ట్రపతి
  • దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు: రాష్ట్రపతి
  • అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది: రాష్ట్రపతి
  • టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువశక్తి సామర్థ్యం చూశాం: రాష్ట్రపతి
  • అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ 7 పతకాలు సాధించింది: రాష్ట్రపతి
  • టోక్యో పారాలింపిక్స్‌లో కూడా భారత్ 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది: రాష్ట్రపతి

11:39 January 31

  • ప్రధానమంత్రి స్వనిధి యోజనతో వీధి వ్యాపారులకు ప్రయోజనం: రాష్ట్రపతి
  • ఇప్పటివరకు 28 లక్షలమంది వీధి వ్యాపారులు ఆర్థిక సాయం పొందారు: రాష్ట్రపతి
  • వీధి వ్యాపారులను ప్రభుత్వం ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తోంది: రాష్ట్రపతి
  • ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులతో భారీగా ఉద్యోగావకాశాలు: రాష్ట్రపతి
  • ఎంఎస్‌ఎంఈలకు చేయూత కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలు: రాష్ట్రపతి
  • ఈ ఏడాది 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కళాశాలల్లో 6 స్థానిక భాషల్లో బోధన: రాష్ట్రపతి
  • క్రీడారంగ బలోపేతానికి వివిధ పథకాలు, సౌకర్యాలు కల్పించాం: రాష్ట్రపతి
  • ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా రోజుకు 100 కి.మీ. రహదారుల నిర్మాణం: రాష్ట్రపతి
  • భారత్‌మాల కింద రూ.6 లక్షల కోట్లతో 20 వేల కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం: రాష్ట్రపతి

11:29 January 31

  • అంబేడ్కర్‌ ఆదర్శాలను మార్గదర్శక సూత్రంగా ప్రభుత్వం పరిగణిస్తుంది: రాష్ట్రపతి
  • ప్రభుత్వ కృషితో యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ పెరుగుతోంది: రాష్ట్రపతి
  • జనఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు అందుబాటులో మందులు: రాష్ట్రపతి
  • మందులు తక్కువ ధరతో ప్రభుత్వం చికిత్స ఖర్చును తగ్గించింది: రాష్ట్రపతి
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తృతం: రాష్ట్రపతి
  • 2021-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించారు. ఈ మొత్తం 2014-15 కంటే 4 రెట్లు ఎక్కువ

11:20 January 31

  • డిజిటల్‌ ఇండియాకు యూపీఐ విజయవంతమైన ఉదహరణ: రాష్ట్రపతి
  • డిజిటల్‌ చెల్లింపులు అంగీకరిస్తున్నారనేందుకు గొప్ప ఉదాహరణ: రాష్ట్రపతి
  • కరోనాపై పోరాటంలో భాగమైన ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలకు అభినందనలు: రాష్ట్రపతి
  • కరోనాపై పోరాటంలో పౌరుల ప్రయత్నాలకు అభినందనలు: రాష్ట్రపతి
  • ఏడాదిలోపే 150 కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించిన రికార్డును అధిగమించాం: రాష్ట్రపతి

11:14 January 31

  • ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల వ్యాక్సినేషన్లు అధిగమించాం: రాష్ట్రపతి
  • భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడాయి: రాష్ట్రపతి
  • అర్హులైన 90 శాతం కంటే ఎక్కువమంది మొదటి డోసు టీకా తీసుకున్నారు: రాష్ట్రపతి
  • ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్యసేవలు: రాష్ట్రపతి
  • సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి: రాష్ట్రపతి
  • కోట్లమంది ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు

11:10 January 31

  • దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులు: రాష్ట్రపతి
  • సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోంది: రాష్ట్రపతి
  • దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నా: రాష్ట్రపతి
  • దేశ సురక్షిత భవిష్యత్‌ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యం: రాష్ట్రపతి
  • గత స్మృతుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం: రాష్ట్రపతి
  • వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తోంది: రాష్ట్రపతి

11:02 January 31

  • పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
  • ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
  • కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకం: రాష్ట్రపతి
  • ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు: రాష్ట్రపతి

10:46 January 31

బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

"సమావేశాల్లో పాల్గొనాలని ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో భారత్​కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాలు దేశాభివృద్ధి, ఆర్థిక ప్రగతి, వ్యాక్సినేషన్, మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ తదితర అంశాలపై నమ్మకాన్ని కలిగిస్తాయి."

-- ప్రధాని మోదీ

10:11 January 31

Budget 2022 Live Updates: 'దేశాభివృద్ధి, ఆర్థిక ప్రగతిపై నమ్మకాన్ని కలిగించేలా బడ్జెట్ సమావేశాలు'

Union Budget 2022: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం కానుంది.

  • రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది.
  • మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.
  • రెండో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చకు కేటాయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 7న ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిచ్చే అవకాశం ఉంది.
  • ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు.
  • సమావేశాల నిర్వహణ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సోమవారం సాయంత్రం 3 గంటలకు అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు.
  • రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సోమవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 31, 2022, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.