ETV Bharat / bharat

'శాసనసభ ఎన్నికల్లో బీఎస్​పీ ఒంటరి పోరు!' - ఐదు రాష్ట్రాల ఎన్నికలు

ఇక నుంచి ఎన్నికల్లో బీఎస్​పీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ మాయావతి. ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం ద్వారా పార్టీ తీవ్రంగా నష్టపోతోందన్నారు.

bsp
'బీఎస్పీ స్వతంత్రంగానే పోటీ చేస్తుంది'
author img

By

Published : Mar 15, 2021, 4:43 PM IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్​ సమాజ్​వాదీ పార్టీ స్వతంత్రంగా పోటీచేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం ప్రకటించారు. బంగాల్, తమిళనాడు, కేరళ సహా పుదుచ్చేరి ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలవమని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా బీఎస్​పీకి నష్టమే జరుగుతోందని అభిప్రాయపడ్డారు.

"ఎన్నికలపై అంతర్గతంగా కృషి చేస్తున్నాము. పార్టీ ప్రణాళికను వెల్లడించము. గత ఎన్నికల్లో ఇతర పార్టీలతో చేతులు కలిపిన ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది. మా పార్టీ కార్యకర్తలు, నేతలు, ఓటర్లు క్రమశిక్షణతో మెలుగుతారు. ఇతర పార్టీల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూటమిలో ఉండటం వల్ల మా ఓట్లు ఇతర పార్టీలకు వెళ్తున్నాయి కానీ.. వారి ఓట్లు మా పార్టీకి రావట్లేదు."

-మాయావతి, బీఎస్​పీ అధినేత్రి

బంగాల్​, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీఎస్​పీ రాణిస్తుందని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. అయితే అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నిర్ణయం ఏంటన్న విషయంపై మాయావతి స్పష్టత ఇవ్వలేదు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరిన మాయావతి.. నిరసనల్లో మృతిచెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.

ఇదీ చదవండి : నామినేషన్​ వేసిన కమల్​, దినకరన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.