ETV Bharat / bharat

యువతే టార్గెట్‌గా ప్రచారం ట్రెండ్‌ ఫాలో అవుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు - బీఆర్‌ఎస్‌ నేతల తీన్మార్‌ డ్యాన్స్‌లు

BRS Election Campaign on Social Media: ప్రస్తుత కాలం యువత ఎక్కువగా సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటున్నారు. ఆ సోషల్‌ మీడియాలో ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు.. దానినే ఫాలో అవుతూ తెగ పాపులర్‌ చేస్తారు. యువత ఓట్లను రాబట్టడానికి రాజకీయ పార్టీలు సైతం అదే దారిలో వెళుతున్నాయి. అందులో ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో ఉందనే చెప్పాలి. ప్రజాదరణ పొందిన రీల్స్‌ను అనుసరిస్తూ.. కొత్త ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు.

BRS Election Campaign
BRS Election Campaign on Social Media
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 5:38 AM IST

యువతే టార్గెట్‌గా ప్రచారం ట్రెండ్‌ ఫాలో అవుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు

BRS Election Campaign on Social Media: అసలే ఇది సోషల్ మీడియా(Social Media) యుగం. కాస్త వెరైటీగా ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే పాపులర్ అవుతుంది. యూత్‌కు నచ్చిందీ అంటే అది మీమ్స్‌(Memes) గా మారి వైరల్ అవుతుంది. సరిగ్గా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.. బీఆర్‌ఎస్‌ నేతలు. సోషల్‌ మీడియాలో ఆకట్టుకునే ప్రచారాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా ప్రజాదరణ పొందిన వీడియోల్ని అనుకరిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. బ్యాండ్ మేళం ముందు పొలిటికల్ షెహరీలు వినిపిస్తూ లైక్స్‌ కొట్టించుకుంటున్నారు.

నగరాలు, పట్టణాల్లో తీన్మార్ డప్పులు ఏదో మూలన వినిపిస్తూనే ఉంటాయి. వేడుకలు, వినోదాలు, ఊరేగింపులలో యువకులు తీన్మార్ దరువుకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటారు. గతంలో ఓ పెళ్లి వేడుకలో బుల్లెట్ బండి పాటకు నవ వధువు చేసిన డాన్స్ ఎంత వైరల్ అయ్యిందో చూశాం. ఆ వెంటనే.. అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవా.. సుఖీభవా అంటూ నెట్టింట వైరల్ అయ్యాడు హైదరాబాద్ నల్లగుట్ట యువకుడు శరత్. పెళ్లి బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. సుఖీభవ, సుఖీభవ అంటూ శరత్‌ వేసిన తీన్మార్ స్టెప్పులు నెట్టింట తెగ సందడిచేశాయి. ఇటీవల ఓ టాలీవుడ్ చిత్ర బృందం సినిమా ప్రమోషన్‌ కోసం ఇలాంటి వ్యూహాన్నే ఎన్నుకుంది. మా ఫ్రెండ్‌ గాడు తాగడానికి పిలిస్తే నేను రానన్నా.. ఎందుకంటే మా కోసం వచ్చిండు రానన్న అంటూ వినూత్నంగా ప్రమోషన్‌ చేశారు. ఈ వినూత్న ప్రమోషన్‌.. ఆ చిత్రానికి మంచి పబ్లిసిటీని తెచ్చింది.

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. తగ్గేదే లే అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

Mallareddy Election Campaign with Teenmaar Dance: ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నాయకులు(BRS Election Campaign) సరిగ్గా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఆకట్టుకుంటున్న వీడియోలను అనుసరిస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా చిన్న వీడియోతోనే లైక్‌లు కొట్టించుకుంటున్నారు. ఏదీ చేసినా సెన్సేషన్‌గా మారే మంత్రి మల్లారెడ్డి(Malla Reddy).. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన తీన్మార్‌ డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. మన అందరికీ 30వ తేదీనాడు మన వేలికి ఇంకు.. ఆ తర్వాత స్టేట్‌ అంతా పింపు.. పింపు.. అంటూ స్టెప్పులు వేశారు.

Telangana Assembly Election 2023 : మంత్రి మల్లారెడ్డి తరహాలోనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు.. ప్రచార పర్వంలో ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావు... బ్యాండ్ మేళం ముందు పొలిటికల్ షెహరీలు వినిపిస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌గా బీజేపీ సోషల్ మీడియా సైతం ఇదే తరహా ప్రచారం నిర్వహిస్తోంది. గులాబీ నేతల షెహరీలకు కౌంటర్లు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నారు.

BRS Telangana Election Plan 2023 : ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధం.. అసంతృప్తులను బుజ్జగించేందుకు కసరత్తులు..

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచార హోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.