Brijesh Kumar Tribunal Hearing on Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాలపై చర్చించాలని ఇటీవల కేంద్రం కోరడంతో.. ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాల పంపిణీపై ఈనెల 6న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై.. అధ్యయనం చేయాల్సి ఉందని.. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి అధ్యయనానికి సమయం ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ఏపీ విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేసిన ట్రైబ్యునల్.. నవంబర్ 15 లోపు అభిప్రాయం చెప్పాలని ఏపీకి ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 22, 23 తేదీల్లో ట్రైబ్యునల్ విచారణ చేపట్టనుంది.
Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదం.. నవంబర్ 22, 23 తేదీల్లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ - కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్
Published : Oct 18, 2023, 4:24 PM IST
|Updated : Oct 18, 2023, 5:52 PM IST
16:22 October 18
ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాలపై చర్చించాలని ఇటీవల కేంద్రం ఆదేశాలు