Brigadier ls Lidder funeral: కున్నూరు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ అంతిమ సంస్కారాలు.. దిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో జరిగాయి. లిద్దర్ కమార్తె ఆశ్నా లిద్దర్.. బాధను దిగమింగుకుంటూ తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.
తన తండ్రి ఓ హీరో అని.. ఆయన జ్ఞాపకాలతో జీవితాన్ని సాగిస్తానని ఆశ్నా పేర్కొన్నారు.
"నాన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. నాకు త్వరలో 17ఏళ్లు నిండుతాయి. ఈ 17ఏళ్ల నాన్న జ్ఞాపకాలతో జీవితాన్ని ముందుకు సాగించాలి. మా నాన్న మరణం.. యావత్ జాతికే జరిగిన నష్టం. మా నాన్న ఓ హీరో. నా బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తి. ఇలా జరగాలని రాసిపెట్టి ఉందనుకుంటా. ముందు మందు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. మా నాన్న అందరిలోనూ ఉత్సాహాన్ని నింపేవారు. నాకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు 'నువ్వు నేను చెప్పింది ఏదైనా వింటావు కదా!' అని అడిగాను. నాన్న నా మాటలు అన్నీ వినేవారు. ఇప్పుడు నాన్న లేరంటే.. చాలా భయంగా ఉంది."
-- ఆశ్నా, బ్రిగేడియర్ లిద్దర్ కుమార్తె
లిద్దర్ అందరినీ ప్రేమించే వ్యక్తి అని, అందరితోనూ సంతోషంగా ఉండేవారని ఆయన భార్య గీతిక తెలిపారు. అందుకే ఆయన అంతిమ సంస్కారాలకు ప్రజలు తరలివచ్చారని పేర్కొన్నారు. 'నేను ఓ జవాను భార్యను.. నా భర్తకు నవ్వుతూ వీడ్కోలు పలుకుతాను,' అని ఆమె అన్నారు. ఆశ్నా.. తన తండ్రిని బాగా మిస్ అవుతుందని, తమ జీవితాల్లో లిద్దర్ లేకపోవడం తీరని లోటుగా మిగిలిపోతుందని భావోద్వేగంతో చెప్పారు గీతిక.
ఇదీ చూడండి:-