ETV Bharat / bharat

గుజరాత్ ఉపఎన్నికల్లో భాజపా క్లీన్​స్వీప్

గుజరాత్​లో భాజపా జయభేరీ మోగించింది. ఉపఎన్నిక జరిగిన మొత్తం 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.

Breaking Gujarat:  By- Poll 8 seats result update
భాజపా జయభేరీ- గుజరాత్​లో 8 స్థానాల్లో గెలుపు
author img

By

Published : Nov 10, 2020, 3:21 PM IST

Updated : Nov 10, 2020, 3:44 PM IST

గుజరాత్ ఉపఎన్నికల్లో భాజపా విజయఢంకా మోగించింది. ఉపఎన్నిక జరిగిన మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది.

తాజా విజయంతో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పార్టీ నేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మిఠాయిలు తినిపించారు.

Breaking Gujarat:  By- Poll 8 seats result update
మిఠాయిలతో భాజపా సంబరాలు

సీఎం రూపానీకి మిఠాయిలు తినిపిస్తున్న భాజపా నేతలు

భాజపా నేతల విజయోత్సవం

కచ్‌లోని అబ్‌దాస, సురేందర్‌నగర్‌ పరిధిలోని లింబ్డి, అమ్రేలిలోని ధారి, మోర్బి జిల్లాలోని మోర్బి, బోతడ్ పరిధి గధాబ, వడోదర జిల్లాలోని కర్జాన్‌, దాంగ్‌జిల్లాలోని దాంగ్‌, వల్సాడ్‌లోని కప్రాదలో ఉపఎన్నికలు జరిగాయి. మొత్తం 81 మంది బరిలో నిలిచారు. ఈ స్థానాలన్నింటిలో భాజపా జయకేతనం ఎగురవేసింది.

2017లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు జూన్‌లో రాజ్యసభ ఎన్నికలకు ముందు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక జరిగింది.

Last Updated : Nov 10, 2020, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.