తౌక్టే తుపాను గుజరాత్‌ను అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి రాష్ట్రంలో 45 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16వేల ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. కనీసం 40వేల వృక్షాలు, 60 వేల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయన్నారు.

తుపాను ప్రభావానికి దాదాపు 2500 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని తెలిపారు అధికారులు.
ఇదీ చదవండి : వాయుగుండంగా మారిన తౌక్టే- ఆ రాష్ట్రాల్లో వర్షాలు!