Bomb Threat To Ayodhya Ram Mandir : అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన రామమందిరాన్ని పేల్చేవేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మొయిల్ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.
2023 డిసెంబర్ 27వ తేదీన రైతు సంఘ నాయకుడు దేవేంద్ర తివారీకి పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న జుబేర్ ఖాన్ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపాడు. అందులో దేవేంద్ర తివారీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్‌ను గోసేవకులుగా పేర్కొంటూ బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. అయోధ్య నూతన రామమందిరాన్ని కూడా బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు.
దీంతో దేవేంద్ర తివారీ తనకు వచ్చిన బెదిరింపు మెయిల్ స్క్రీన్ షాట్‌ను తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో పోస్ట్ చేశారు. యూపీ పోలీసులతోపాటు సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులను ట్యాగ్ చేశారు. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తును కోరారు. దేవేంద్ర తివారీ ఫిర్యాదు మేరకు లఖ్‌నవూలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సహేంద్ర కమార్ కేసు నమోదు చేశారు.
-
राम मंदिर योगी आदित्यनाथ और इलीगल स्लॉटर हाउस के खिलाफ आईपीएल करने वाले देवेंद्र तिवारी को बम से उड़ने की मिली धमकी धमकी देने वाले ने फोटो पर क्रॉस का निशान लगा कर भेजो और मेल पर कहा तीनों को बम से उड़ा दिया जाएगा ISI @aajtak @myogiadityanath @Uppolice @myogioffice @narendramodi… pic.twitter.com/IWVj4lnHpe
— Devendra Tiwari (@iDevendraBKM) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">राम मंदिर योगी आदित्यनाथ और इलीगल स्लॉटर हाउस के खिलाफ आईपीएल करने वाले देवेंद्र तिवारी को बम से उड़ने की मिली धमकी धमकी देने वाले ने फोटो पर क्रॉस का निशान लगा कर भेजो और मेल पर कहा तीनों को बम से उड़ा दिया जाएगा ISI @aajtak @myogiadityanath @Uppolice @myogioffice @narendramodi… pic.twitter.com/IWVj4lnHpe
— Devendra Tiwari (@iDevendraBKM) December 27, 2023राम मंदिर योगी आदित्यनाथ और इलीगल स्लॉटर हाउस के खिलाफ आईपीएल करने वाले देवेंद्र तिवारी को बम से उड़ने की मिली धमकी धमकी देने वाले ने फोटो पर क्रॉस का निशान लगा कर भेजो और मेल पर कहा तीनों को बम से उड़ा दिया जाएगा ISI @aajtak @myogiadityanath @Uppolice @myogioffice @narendramodi… pic.twitter.com/IWVj4lnHpe
— Devendra Tiwari (@iDevendraBKM) December 27, 2023
బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తును మమ్మురం చేశారు పోలీసులు. ఏటీఎస్, ఎస్టీఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మెయిల్ పంపిన జుబేర్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని దేవేంద్ర తివారీ తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబయిలో 11 బాంబులు పెట్టినట్లు కొన్నిరోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్బీఐ కేంద్ర కార్యాలయం సహా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల కార్యాలయాల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్లో దుండగులు పేర్కొన్నారు. వరుసగా ఒక్కో బాంబు పేలుతుందని దుండగులు మెయిల్లో హెచ్చరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ పదవులకు రాజీనామా చేయాలని బెదిరించారు. అయితే సంబంధిత ప్రదేశాల్లో తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.
మోదీ, యోగిని చంపుతామంటూ మెయిల్.. పోలీసులు అలర్ట్.. త్వరలోనే..
బెంగళూరులో 48 స్కూళ్లకు బాంబు బెదిరింపులు- పేరెంట్స్‌లో ఫుల్ టెన్షన్- పోలీసులు అలర్ట్