ETV Bharat / bharat

Black Fungus: పెద్ద పేగుకు సోకిన బ్లాక్​ ఫంగస్ ​ - బ్లాక్​ ఫంగస్ ​ వ్యాధి

ఇప్పటి వరకు మానవ శరీరంలోని కళ్లలో, మొదడులో బ్లాక్ ఫంగస్​ వ్యాధిని గుర్తించారు వైద్యులు. అయితే.. తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి శరీరంలోని పెద్ద పేగులో బ్లాక్​ ఫంగస్​ ఉన్నట్లు నిర్ధరించారు డాక్టర్లు. ఇలాంటి కేసు నమోదు కావటం రాష్ట్రంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు.

Black fungus
బ్లాక్​ ఫంగస్ ​
author img

By

Published : Jul 27, 2021, 12:28 PM IST

మహారాష్ట్రలో నమోదైన ఓ బ్లాక్​ ఫంగస్​ కేసు ఆందోళనను కలిగిస్తోంది. నాగ్​పుర్​కు చెందిన 70ఏళ్ల వృద్ధుడి శరీరంలోని పెద్ద పేగులో బ్లాక్​ ఫంగస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన సెవెన్​ స్టార్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి కారణంగా ఇప్పటికే ఆయన కంటిచూపు కోల్పోయారు.

కొద్దిరోజుల క్రితం వృద్ధుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర.. బ్లాక్​ ఫంగస్ వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.