ETV Bharat / bharat

అడ్వాణీ, జోషికి భాజపాలో మరోమారు కీలక బాధ్యతలు! - భాజపా న్యూస్​

భాజపా సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి సహా మొత్తం 80 మందితో జాతీయ కార్యనిర్వాహక బృందాన్ని(bjp national executive body) ఏర్పాటు చేసింది కమలదళం.

National Executive list
అడ్వాణీ, జోషికి భాజపాలో మరోమారు కీలక బాధ్యతలు
author img

By

Published : Oct 7, 2021, 2:12 PM IST

Updated : Oct 7, 2021, 2:34 PM IST

పార్టీ అజెండా రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే జాతీయ కార్యనిర్వాహక బృందంలో(bjp national executive body) 80 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news) నుంచి కేంద్ర మంత్రులు, పలువురు రాష్ట్రాల నాయకులు, పార్టీ సీనియర్​ నేతలైన ఎల్​కే అడ్వాణీ(l k advani news), మురళీ మనోహర్​ జోషి ఉన్నారు.

అలాగే.. కార్యనిర్వాహక బృందంలో కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, ఇటీవలే మంత్రివర్గంలో చేరిన అశ్వినీ వైష్ణవ్ సహా పలువురి పేర్లు ఉన్నాయి. మాజీ మంత్రులు హర్షవర్ధన్​, రవిశంకర్​ ప్రసాద్​, ప్రకాశ్​ జావడేకర్​కూ చోటు కల్పించారు. ​

భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి మేనకా గాంధీ, వరుణ్‌గాంధీని తొలగించారు.

80 మంది సాధారణ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది, శాశ్వత ఆహ్వానితులుగా 179 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు.

జాతీయ కార్యనిర్వాహక బృందం.. కేంద్ర ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూ.., పార్టీ అజెండాను సిద్ధం చేయటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కొవిడ్​-19 కారణంగా చాలా కాలంగా కార్యనిర్వాహక బృందం సమావేశాలు నిర్వహించటం లేదు.

ఏపీ, తెలంగాణ నుంచి..

భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ఆంధ్రప్రదేశ్​ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చోటు లభించగా.. తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహనరావుకు చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పించారు.

National Executive list
భాజపా జాతీయ కార్యనిర్వాహక బృందం జాబితా

ఇదీ చూడండి: ప్రభుత్వాధినేతగా మోదీ సరికొత్త మైలురాయి- 20 ఏళ్లు పూర్తి

Last Updated : Oct 7, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.