ETV Bharat / bharat

ఎంపీకే టోకరా.. క్రెడిట్​ కార్డు ఫోర్జరీతో మోసం! - ఛత్తీస్​ఘడ్​

భాజపా రాజ్యసభ సభ్యుడు రామ్​విచార్​ నేతమ్​ క్రెడిట్​ కార్డును కేటుగాళ్లు ఫోర్జరీ చేసి దాదాపు రూ. 37,000 డ్రా చేశారు. ఈ లావాదేవీ ఫిబ్రవరి 24న జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

BJP MP
భాజపా ఎంపీ రామ్​విచార్​ నేతమ్
author img

By

Published : Jun 11, 2021, 4:21 PM IST

భాజపా రాజ్యసభ సభ్యుడు, ఛత్తీస్​గఢ్​​ మాజీ మంత్రి రామ్​విచార్​ నేతమ్​ క్రెడిట్​ కార్డును దుండగులు ఫోర్జరీ చేసి దాదాపు రూ. 37,000 డ్రా చేశారు. దీనికి సంబంధించి రాయ్​పుర్​లోని తేలీబంధా పోలీస్​ స్టేషన్​లో ఎంపీ బంధువు ఒకరు గురువారం ఫిర్యాదు చేశారు.

"రామ్​విచార్​ పేరు మీద ఉన్న ఎస్​బీఐ క్రెడిట్​ కార్డును గుర్తుతెలియని వ్యక్తి తప్పుదారిలో ఉపయోగించి రూ.36,844ను డ్రా చేశాడు. ఈ లావాదేవీ ఫిబ్రవరి 24న జరిగింది. "

-సోనాల్​ గ్వాలా, తేలీబంధా పోలీసు స్టేషన్​ ఎస్​హెచ్​ఓ

తమ కార్డు మీద రూ. 45,668 బాకీ ఉందని బ్యాంకు నుంచి ఎంపీకి ఇటీవల ఫోన్​ రావటం వల్ల క్రెడిట్​ కార్డు ఫోర్జరీ విషయం బయటపడింది. అయితే తను ఆ కార్డుమీద డబ్బులే తీసుకోలేదని, ఆ కార్డు 2020లోనే కాలం చెల్లటం వల్ల ఎప్పుడో నాశనం చేశానని ఎంపీ బదులిచ్చారు. రెన్యువల్​ కూడా చేయించలేదని చెప్పారు. కాలం చెల్లిన కార్డును దుండగుడు రెన్యువల్​ చేయించి ట్రాన్సాక్షన్​ జరిపినట్లు తెలుస్తోంది.

ఎంపీ తరఫున ఆయన బంధవు వచ్చి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చదవండి: మోదీపై శివసేన స్వరం మారిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.