ETV Bharat / bharat

పారికర్​ కుమారుడికి భాజపా షాక్​.. పార్టీ మారతారా?

Goa Assembly polls: దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్​కు షాక్​ ఇచ్చింది భాజపా. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. అందులో ఉత్పల్​ పేరు లేదు. మరోవైపు.. తమ పార్టీలో చేరాలని ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ బహిరంగ ఆఫర్​ చేశారు. స్వతంత్రంగా పోటీ చేస్తే మద్దతిస్తామని శివసేన ప్రకటించటమూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఉత్పల్​ పారికర్​ భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.

parikkar
ఉత్పల్​ పారికర్​, దేవేంద్ర ఫడణవీస్​
author img

By

Published : Jan 20, 2022, 3:43 PM IST

Goa Assembly polls: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్​కు షాక్​ ఇచ్చింది భాజపా. తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు. గురువారం మొత్తం 40 సీట్లకు గాను 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన భాజపా.. ఉత్పల్​కు టికెట్​ ఇవ్వకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఉత్పల్​ పారికర్​కు టికెట్​ ఇవ్వకపోవటంపై విలేకరులు ప్రశ్నించగా సమాధానం ఇచ్చారు భాజపా గోవా రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ దేవేంద్ర ఫడణవీస్​.

" పారికర్​ కుటుంబం ఎల్లప్పుడూ మన కుటుంబమే. కానీ, ఉత్పల్​ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో ఇప్పటికే భాజపా సిట్టింగ్​ ఎమ్మెల్యే ఉన్నారు. సిట్టింగ్​ ఎమ్మెల్యేను పక్కన పెట్టటం సరైనది కాదు. ఉత్పల్​కు పోటీ చేసేందుకు మరో రెండు స్థానాలను సూచించాం. దానిని ఆయన తిరస్కరించారు. ఉత్పల్​తో చర్చలు కొనసాగుతున్నాయి. పార్టీ నిర్ణయానికి అంగీకరిస్తారనే నమ్మకం ఉంది. "

- దేవేంద్ర ఫడణవీస్​, భాజబా ఎన్నికల ఇంఛార్జ్​.

ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు పారికర్​ కుటుంబ సన్నిహిత వర్గాల్లో ఒకరు. తన తండ్రి ఎమ్మెల్యేగా చేసిన స్థానంలో పోటీ చేయాలని ఉత్పల్​ పారికర్​ సెంటిమెంట్​గా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు ఉత్పల్​ను ఒప్పించి.. భాజపా ఆఫర్​ చేస్తున్న ఇతర స్థానాల్లో పోటీ చేయాలని చెప్పినా అలా చేయరని పేర్కొన్నారు.

మరోవైపు.. గత నెల రోజులకుపైగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, దేవేంద్ర ఫడణవీస్​.. ఉత్పల్​తో మాట్లాడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరో స్థానంలో పోటీ చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేసినా ఉత్పల్​ నుంచి స్పందన లేదని పేర్కొన్నాయి. ' ఉత్పల్​తో మాట్లాడాం. ఆయన రాజకీయ భవిష్యత్తు సరిగ్గా ఉండాలంటే పార్టీ చెప్పిన స్థానంలో పోటీ చేయాలని సూచించాం. ఆయన విజయం సాధించే స్థానాన్నే పార్టీ ఆఫర్​ చేసింది. ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకున్నా.. ఆయన పార్టీలోనే కొనసాగుతారు.' అని భాజపా వర్గాలు తెలిపాయి.

కేజ్రీవాల్​ ఆఫర్​..

భాజపా తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే ఉత్పల్​ పారికర్​ తమ పార్టీలో చేరాలని కోరుతూ ట్వీట్​ చేశారు ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. 'పారికర్​ కుటుంబంతో కూడా భాజపా యూజ్​​ అండ్​ త్రో పాలసీని అవలంబించటంపై గోవా ప్రజలు బాధపడుతున్నారు. మనోహర్​ పారికర్​ను నేను గౌరవిస్తూనే ఉంటాను. మా పార్టీలో చేరాలని ఉత్పల్​కు స్వాగతం పలుకుతున్నాం. ఆప్​ టికెట్​పై పోటీ చేయాలని కోరుతున్నాం.' అని ట్వీట్​ చేశారు.

శివసేన కీలక వ్యాఖ్యలు..

ఎన్నికల్లో ఉత్పల్​ పారికర్ పోటీ చేయటంపై ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఎంపీ, శివసేన నేత సంజయ్​ రౌత్​. పనాజీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని, విపక్ష పార్టీలు ఆయనకు అండగా నిలబడాలని కోరుతూ ట్వీట్​ చేశారు.

అయితే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటంపై ఇప్పటి వరకు స్పందించలేదు ఉత్పల్​ పారికర్​. మరోవైపు.. భాజపా ఆరు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. మిగిలిన స్థానాల్లో జూనియర్​ పారికర్​కు ఆఫర్​ చేసే అవకాశాలు ఉన్నాయి. ​ ఈ క్రమంలో ఆయన పోటీ చేయటంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: గోవా ఎన్నికల్లో 'శివసేన-ఎన్సీపీ' పొత్తు.. కాంగ్రెస్​పై సెటైర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.