ETV Bharat / bharat

22ఏళ్లుగా స్నానం బంద్.. 12ఏళ్ల నుంచి ఆకులు, పువ్వులే ఆహారం - no bathing for 22 years

22 years no shower: బిహార్​కు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్లుగా స్నానం చేయకుండా ఉంటున్నారు. మహిళలపై నేరాలు ఆగేంతవరకు స్నానం చేయనని ప్రతిజ్ఞ చేసిన ఆయన.. దానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. మరోవైపు, అదే రాష్ట్రంలో ఓ వ్యక్తి 12ఏళ్లుగా ఆకులు, పువ్వులు తిని బతికేస్తున్నారు.

bihar-man-didnt-bath-for-22-years
bihar-man-didnt-bath-for-22-years
author img

By

Published : Jul 28, 2022, 7:42 PM IST

22ఏళ్లుగా స్నానం బంద్.. 12ఏళ్ల నుంచి ఆకులు, పువ్వులే ఆహారం

22 years no shower: సెలవురోజు స్నానం చేయకుండా ఉండటం.. చాలా మంది చేసే పనే. అదే వారం రోజులు స్నానం చేయకపోతే.. ఒంటి నుంచి దుర్వాసన గుప్పుమంటుంది. చర్మ పాడవుతుంది. కానీ బిహార్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 22ఏళ్ల నుంచి స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. గోపాల్​గంజ్ జిల్లా, బైకుంఠపుర్​కు చెందిన ధరమ్​దేవ్ రామ్.. 2000 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా.. దీని వెనక ఉన్న కారణం తెలిస్తే ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేం.

మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ఆయన స్నానం చేయడం మానేశారు. వీటితో పాటు భూతగాదాలు, హత్యలు ఆగిపోయేంత వరకు స్నానం చేయబోనని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 62 కాగా.. 40ఏళ్ల వయసులోనే స్నానాన్ని ఆపేశారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ప్రతిజ్ఞకు కట్టుబడే ఉన్నారు ధరమ్​దేవ్. భార్య, కుమారుడు మరణించిన సమయంలోనూ ఆయన స్నానం చేయలేదని స్థానికులు చెబుతున్నారు.

Bihar man didn't bath for 22 years
ధరమ్​దేవ్ రామ్

"1975లో బంగాల్​లోని ఓ ఫ్యాక్టరీలో నేను పనిచేస్తుండేవాడిని. 1978లో నాకు వివాహం అయింది. 1987 సమయంలో మహిళలపై నేరాలు, భూతగాదాలు, జంతుబలులు, హత్యలు ఎక్కువైపోయాయని గ్రహించా. వీటికి పరిష్కారం కోసం ఓ 'గురువు' దగ్గరకు వెళ్లా. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఆయన నాకు సూచించారు. అప్పటి నుంచి భక్తి మార్గంలోనే వెళ్తున్నా. రాముడిని ప్రార్థిస్తూ జీవిస్తున్నా" అని ధరమ్​దేవ్ ఈటీవీ భారత్​కు వివరించారు. ఇన్నేళ్ల నుంచి స్నానం చేయకపోయినా ధరమ్​దేవ్ ఆరోగ్యంగానే ఉండటం విశేషం. స్నానం చేయకపోవడం వల్ల ఎలాంటి జబ్బులు రాలేదని ఆయన చెబుతున్నారు.

పువ్వులే ఆహారం..
మరోవైపు, ఇదే రాష్ట్రంలోని సారణ్ జిల్లాకు చెందిన సంత్ జైశ్రీరామ్ దాస్.. 12ఏళ్లుగా అన్నం తినకుండానే బతికేస్తున్నారు. కేవలం పువ్వులను తింటూ ఆయన జీవనం సాగిస్తున్నారు. పానాపుర్ ప్రాంతంలో ఉంటున్న ఆయన్ను స్థానికులు 'బేల్పతియా బాబా'గా కొలుస్తున్నారు.

no food for 12 years
ఆకులు తింటున్న బాబా

ఎండు మిరపకాయలతో హోమం నిర్వహించడం ఈ బాబా ప్రత్యేకత. శ్రావణమాసంలో మూడు రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. విశ్వాన్ని రక్షించేందుకే ఈ హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆకులు, పువ్వులు తింటూనే జీవిస్తున్న ఆయన.. ఇప్పటివరకు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని చెబుతున్నారు. ఆధ్యాత్మికత మార్గాన్ని పాటిస్తున్నందునే ఇలా సాధ్యమైందని అంటున్నారు.

కర్ణాటకలోని తీక్షణ ప్రత్యంగిరా దేవి మందిరంలోనూ ఇలా ఎండు మిరపకాయలతో హోమం నిర్వహిస్తారు. దేవతలను పూజిస్తూ పౌర్ణమి రోజున ఈ హోమం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.