ETV Bharat / bharat

బాలిక దారుణ హత్య.. ఇంటికి తీసుకెళ్లి ఇనుప రాడ్​తో కొట్టి.. కిరోసిన్ పోసి నిప్పు.. - missing youth found dead in bihar

12 ఏళ్ల బాలికపై పాశవికంగా దాడి చేసి హత్య చేశారు కొందరు దుండగులు. ఆ హృదయ విదారక ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు.. 8 ఏళ్ల మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు బాలురు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

12 year old girl murdered in Arrah
12 year old girl murdered in Arrah
author img

By

Published : Mar 12, 2023, 8:51 PM IST

Updated : Mar 12, 2023, 10:00 PM IST

బిహార్​.. భోజ్​పురిలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికను ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టారు కొందరు దుండగులు. అనంతరం బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మిల్లు సింగ్​ అనే వ్యక్తి తియార్​ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడికి 12 ఏళ్ల కుమార్తె అన్షు ఉంది. బాధితురాలు ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటోంది. మార్చి 5న బాలిక తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్లింది. అయితే, తనతో పాటు వెళ్లిన అందరూ తిరిగివచ్చారు. అన్షు మాత్రం ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారు పడిన బాలిక కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రదేశాల్లో వెతికారు.

అయితే.. అన్షును కుషి కుమారి అనే మరో బాలిక తన ఇంటికి తీసుకెళ్లిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత కుషి ఇంటికి వెళ్లి చూడగా.. ఓ గదిలో అన్షు ఐరన్​ రాడ్డుతో కొట్టిన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికిగా తరలించగా చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బాలికపై గ్యాంగ్​రేప్​..
ఉత్తర్​ప్రదేశ్​ సంభాల్​ జిల్లాలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. మార్చి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జన్​వాని పోలీస్​ స్టేషన్ పరిధిలో ఎనిమిదేళ్ల బాలిక నివసిస్తోంది. మార్చి 9న బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో 12 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఆమె వద్దకు వచ్చారు. కలిసి ఆడుకుందాం అని బాలికను నమ్మించి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలి నుంచి బాధితురాలు ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆమె ఆనారోగ్యానికి గురవడం వల్ల.. ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె అత్యాచారానికి గురైనట్లు తెలిపారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్టు చేసి జువెనైల్​ కోర్టులో హాజరు పరిచారు.

మంటల్లో కాలుతున్న మృతదేహం...
బిహార్​ ముజఫర్​నగర్​లో దారుణం జరిగింది. ఆవు పిడకల మంటల్లో కాలుతున్న మృతదేహాన్ని చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తితర్​వాడ గ్రామానికి చెందిన కుల్దీప్​ చౌహాన్​ కుమారుడు సుభాశ్​​ తన మేన మామ వద్ద ఉంటున్నాడు. కాగా, రెండు రోజులుగా సుభాశ్ కనిపించకుండా పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఖతౌలీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ఆదివారం మంటల్లో కాలుతున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం సుభాశ్​దిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Last Updated : Mar 12, 2023, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.