ETV Bharat / bharat

ఎన్నికల సమరం: కమలం ఆరాటం.. కాంగ్రెస్​ పోరాటం - కాంగ్రెస్​ x భాజపా ఎన్నికలు

రానున్న 5 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్​ ఊవిళ్లూరుతున్నాయి. విజయాల పరంపరను కొనసాగించాలని భాజపా భావిస్తుంటే.. ఎలాగైనా గెలుపుబాట పట్టాలని కాంగ్రెస్​ యోచిస్తోంది. మరి కాంగ్రెస్​ సత్తా చాటేనా? కమలనాథుల ఆధిపత్యం కొనసాగేనా?

Congress and Bjp
ఎన్నికల సమరం: కమలం ఆరాటం.. కాంగ్రెస్​ పోరాటం
author img

By

Published : Feb 28, 2021, 5:26 AM IST

దేశంలో 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తి రేకేత్తిస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్​ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి.

బంగాల్​పై భాజపా గురి..

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాలుగు రాష్ట్రాలు సహా..పుదుచ్చేరిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది.ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో తాము ప్రవేశపెట్టిన సంస్కరణలకు జనామోదం లభించినట్లే భావించవచ్చునని అంచనా వేస్తోంది. ముఖ్యంగా బంగాల్‌లో జెండా పాతడానికి ఆ పార్టీ పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర హోంమంత్రి, భాజపా వ్యూహ మాంత్రికుడు అమిత్‌ షా స్వయంగా ఆ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

బంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలుండగా వాటిలో 200కు పైగా సీట్లను దక్కించుకోవాలని కమలదళం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. భాజపా విజయావకాశాలపై బంగాల్‌ భాజపా నాయకుడు సునీల్‌ మేనన్‌ ధీమా వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్‌లో తమకు 41 శాతం ఓట్లు దక్కాయని చెప్పారు. 42 లోక్‌సభ స్థానాలకు 18 గెలిశామని, రెండు చోట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయినట్లు గుర్తు చేశారు. అప్పటి లెక్కల ప్రకారం చూస్తే 125 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించినట్లేనన్న సునీల్‌ మేనన్ అన్నారు. రోజురోజుకు పార్టీ మరింత బలపడుతున్నట్లు వివరించారు.

అసోంలో మళ్లీ అధికారంలోకి వస్తామని..భాజపా సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దక్షిణ భారత్‌లోని కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని కొంతకాలంగా భాజపా పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికలను అందుకు ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. మిత్రపక్షాలైన ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకేలతో కలిసి పుదుచ్చేరి, తమిళనాడుల్లో అధికారంలోకి వస్తామని ఆశిస్తోంది. కేరళలోనూ ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​లకు ధీటైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

మళ్లీ విజయాలకు కాంగ్రెస్ తహతహ

అటు వరుస పరాజయాలు వెక్కిరిస్తున్న వేళ ఈ ఎన్నికలతో తిరిగి విజయాల బాట పట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందుకు తగ్గట్లే పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ...కేరళ, తమిళనాడుపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ రాష్ట్రాలకు స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళనాడులో డీఎంకేతో కలిసి అధికార పగ్గాలు చేపట్టగలమని హస్తం పార్టీ విశ్వాసంతో ఉంది. మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గోగోయ్‌ కన్నుమూతతో.. అసోంలో డీలా పడ్డ కాంగ్రెస్‌..... భాజపా నుంచి తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు ఏఐయూడీఎఫ్ తో చేతులు కలిపింది. బంగాల్‌లో వామపక్షాలతో కలిసి సీట్ల సంఖ్య పెంచుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.