కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప. మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రాన్ని పాలించటం చేతకాకపోతే అధికారం నుంచి తప్పుకోవాలని దుయ్యబట్టారు. అంతర్గత కలహాలతో సంకీర్ణ కూటమి ఇంకా ఎంతోకాలం అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు .
" మాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలోనే చెప్పాను. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో 20 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ మీకు పాలన చేపట్టేంత సామర్థ్యం లేకపోతే రాజీనామా చేయండి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 13 నెలలకే మరోమారు ఎన్నికలంటే ప్రజలు అంగీకరించరు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు సరికావు. రాజీనామా చేసి ఇంటికి వెళ్లండి. మేము పాలన చేస్తాం. "
- యడ్యూరప్ప, భాజపా కర్ణాటక అధ్యక్షుడు.
ఇదీ చూడండి: జడ్జీల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి సీజేఐ లేఖ