ETV Bharat / bharat

అద్భుత నిర్మాణం అటల్​ టన్నెల్ ప్రత్యేకతలివే.. - worlds longest tunnel

ప్రపంచంలోనే అతిపొడవైన సొరంగ మార్గం.. ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. అటల్​ టన్నెల్​ నిర్మాణమే ఓ అత్భుతమైతే, ఇందులో ప్రత్యేకతలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత కీలక మార్గంలో ఈ వ్యూహాత్మక సొరంగం కనువిందు చేసేందుకు రంగం సిద్ధమైంది. మనాలి-లేహ్​ల మధ్య ప్రధాని చేతులమీదుగా రోహ్​తంగ్​ వద్ద ప్రారంభమవ్వనున్న ఈ సొరంగ మార్గం... అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంటూ​.. హిమాచల్​కే సరికొత్త శోభ తీసుకురానున్న ఈ టన్నెల్​ ప్రత్యేకతలేంటి ?

worlds longest atal tunnel's specialities
అద్భుత నిర్మాణం అటల్​ టన్నెల్ ప్రత్యేకతలివే..
author img

By

Published : Oct 3, 2020, 4:42 AM IST

అద్భుత నిర్మాణం అటల్​ టన్నెల్ ప్రత్యేకతలివే..

హిమాలయ పర్వతాల్లో ప్రయాణం అత్యంత క్లిష్టమైనది. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ అప్రమత్తంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. తక్కువ దూరాలకే గంటల కొద్దీ సమయం పడుతుంటుంది. కానీ, ఇక మనాలి- లేహ్​ మార్గంలో ఆ ఇబ్బందులకు గుడ్​బై చెప్పే సమయం వచ్చేసింది. ఎందుకంటే... మంచుశిఖరాల అంచుల్లో నిర్మించిన అతి పెద్ద సొరంగ మార్గం ప్రారంభం అవుతోంది.

వ్యూహాత్మక ప్రత్యేకత..

అక్టోబర్​ 3న ఉదయం 10గంటలకు ప్రధాని చేతుల మీదుగా ఈ అత్యాధునిక సొరంగం ప్రారంభోత్సవం కోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ సిద్ధంగా ఉంది. అనేక వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఈ సొరంగంతో మనాలి- లేహ్‌ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంతేకాదు దాదాపు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. క్లిష్టమైన ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించారు.

worlds longest atal tunnel's specialities
అద్భుత నిర్మాణం అటల్​ టన్నెల్ ప్రత్యేకతలివే..

ఏడాది పొడవునా అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకుని దీటుగా నిలబడే ఈ సొరంగ మార్గం.. మనాలిని లేహ్​లోని లాహౌల్​-స్పితి లోయతో అనుసంధానం చేస్తుంది. గతంలో భారీమంచుతో ఈ లోయకు 6 నెలల పాటు రాకపోకలు నిలిచిపోయేవి.

ఈ టన్నెల్​ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వినియోగించారు. హిమాలయాల్లోని పీర్​ పంజాల్​ పర్వతశ్రేణిలో 3వేల మీటర్లు.. అంటే సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ నెలవై ఉంది. ఈ సొరంగ మార్గం దక్షిణ ద్వారం.. మనాలికి 25 కిలో మీటర్ల దూరంలో ఉండగా.. ఉత్తర ద్వారం.. లాహౌల్​ లోయలోని తెలింగ్​ గ్రామం వద్ద ఉంది.

టన్నెల్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత

నిర్మాణమే.. నయా సోయగం

  • అశ్వం ఆకారంలో నిర్మించిన ఈ సింగిల్​ ట్యూబ్ టన్నెల్​లో​-డబుల్​ లేన్​ ఉంటుంది. 8 మీటర్ల విస్తీర్ణంలో రోడ్డు ఉంటుంది.
  • 5.52 మీటర్ల ఓవర్​హెడ్​ క్లియరెన్స్​ దీని ప్రత్యేకత.
  • అగ్నిప్రమాద రహిత సాంకేతికత ప్రధాన టన్నెల్​ నిర్మాణంలోనే అమర్చారు.
  • 3వేల కార్లు, 1,500 ట్రక్కులు.. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా సొరంగం ఉంటుంది.
  • ఈ అత్యాధునిక టన్నెల్​లో ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థతో పాటు అధునాతన వెంటిలేషన్​ వ్యవస్థలు ఉన్నాయి.
  • ఎస్​సీఏడీఏ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు నడుస్తుంటాయి.

    9.02 కిలోమీటర్ల టన్నెల్​ నిర్మాణం

భద్రతకు భరోసా

  • రెండు ప్రవేశ ద్వాారాల వద్దా చెక్​ పాయింట్లు ఉంటాయి.
  • ప్రతి 150 మీటర్ల వద్దా అత్యవసర అవసరాలకు, టెలిఫోన్​ అందుబాటులో ఉంటుంది.
  • ప్రతి 60 మీటర్ల దగ్గర అగ్నిమాపక పరికరాలుంటాయి.
  • ప్రమాదాలను పసిగట్టే నిఘా కెమెరాలు ప్రతి 250 మీటర్ల వద్ద ఏర్పాటు చేశారు.
  • కిలోమీటర్​ చొప్పును గాలి నాణ్యతను పరిశీలిస్తారు.
  • ప్రతి 25 మీటర్లకు సంకేతాలకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తాయి.
  • టన్నెల్ పొడవునా అధికారుల సూచనలు వినిపించే వ్యవస్థ ఉంటుంది.
  • అగ్నిప్రమాదాలను పసిగట్టే కెమెరాలు ప్రతి 60 మీటర్లకు ఉంటాయి.

    80 కిలోమీటర్ల వేగంతో వాహనాల ప్రయాణం

అద్యుడు అటల్​

ఇలా అధునాతన హంగులతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సొరంగ మార్గాన్ని రూ.3,300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ప్రత్యేకతల పరంగానే కాకుండా... దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. అత్యంత వ్యూహాత్మకమైన మార్గంగా, సైనిక అవసరాలకు కీలకంగా అటల్​ టన్నెల్ నిలవనుంది.

ఈ క్లిష్టమైన వ్యూహాత్మకమైన మార్గాన్ని నిర్మించేందుకు బోర్డర్ రోడ్స్​ ఆర్గనైజైషన్​... బీఆర్​వో అనేక సవాళ్లు ఎదుర్కుంది. భౌగోళికంగా, వాతావరణంతో పోరాడి ఈ అత్యద్భుతమైన టన్నెల్ నిర్మించింది.

ఈ కీలకమైన టన్నెల్​ నిర్మాణానికి 2000 సంవత్సరంలోనే బీజం పడింది. రోహ్​తంగ్​ పాస్​ కింది నుంచి వెళ్లే ఈ వ్యూహాత్మక సొరంగ మార్గం నిర్మాణానికి... నాటి ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీ 2000, జూన్​ 3నే నిర్ణయం తీసుకున్నారు. 2002, మే 6న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

ఆద్యుడు అటల్​

స్నేహానికి ప్రతీకగా..

ఈ సొరంగ మార్గం నిర్మాణం వెనుక.. వాజ్​పేయీ బాల్య స్నేహితుడి డిమాండ్​ ఉన్నట్లు చెబుతున్నారు పరీశీలకులు. ఈ టన్నెల్​ నిర్మాణం ఆలోచన తశి దావా ఇచ్చారు. అర్జున్​ గోపాల్​గా సుపరిచితులు అయిన తశి.. లేహ్​లోని తొలంగ్ గ్రామం వాసి. ఆర్​ఎస్సెస్​లో ఉన్నప్పుడూ వాజ్​పేయూ-అర్జున్​ స్నేహితులు. ఈ నేపథ్యంలోనే స్నేహానికి ప్రతీకగా ఈ సొరంగ మార్గం నిలుస్తుందని చెబుతున్నారు. నాటి ఈ సొరంగం డిమాండ్​ వెనుక తశి దావాతో పాటు, చరిత్రకారుడు సెరింగ్​ డోర్జీ, అభయ్​ చందా రాణా సైతం ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

గతేడాది డిసెంబర్​లో మోదీ ప్రభుత్వం ఈ సొరంగ మార్గానికి అటల్​ బిహరీ వాజ్​పేయీ స్మారకంగా నామకరణం చేసింది.

హిమాచల్​కు అనేక లాభాలు

ఈ అత్యద్భుత టన్నెల్​.. హిమాచల్​ ప్రదేశ్​కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిత్యం పర్యటకులతో అలరారే హిమాచల్​కు ఈ సొరంగ మార్గం ఆర్థికంగా తోడ్పడనుంది. పర్యటకం, వ్యాపార-వాణిజ్యాల పరంగా అనేక అవకాశాలు సృష్టించనుంది. ఒక్కసారి టన్నెల్​ ప్రజలకు అందుబాటులోకి వస్తే... గిరిజన పర్యటకం ఊపందుకోనుంది. ఇప్పటివరకూ 6 నెలల పాటు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే లాహౌల్​కు​ ఇకపై ఏడాది పొడవునా రాకపోకలు జరగనున్నాయి. అక్కడి ఆలుగడ్డలు, ఇతర స్థానిక ఉత్పత్తులకు మార్కెట్​ విస్తరించనుంది. అక్కడి నుంచి వలసలు తగ్గి- ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

ఉత్తర భారత్​లో అత్యంత రద్దీ కలిగిన పర్యటక ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న మనాలి.. ఇప్పటికే హిమాచల్​ ప్రదేశ్​ పర్యటక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపొడవైన సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.

ఈ సొరంగ మార్గం వ్యుహాత్మక ప్రాధాన్యం చాలా ఉంది. ముఖ్యంగా లద్దాఖ్​ సరిహద్దులో ఉద్రిక్తతతల నేపథ్యంలో లేహ్​ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కీలకంగా మారింది. ఈ టన్నెల్​ నిర్మాణం లాహౌల్ నుంచి లేహ్​ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుంది. భారత సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ నిర్మాణం ఎంతో ఉపయోగపడనుంది. మొత్తంగా ఈ అధునాతన టన్నెల్ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ సొరంగ మార్గం మరిన్ని ప్రత్యేకతలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.