ETV Bharat / bharat

'జల యోగా'తో ప్రపంచ రికార్డుపై బుడతడి గురి! - యోగా

పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతను అక్షరాలా నిరూపిస్తున్నాడు కేరళకు చెందిన ఓ బుడతడు. తిరువనంతపురానికి చెందిన ప్రతీశ్​ ప్రపంచ రికార్డుపైనే గురిపెట్టాడు. నీటిపై తేలియాడే యోగా సాధన చేస్తున్న ఈ బుడతడి వయస్సు ఎంతో తెలుసా...? ఏడేళ్లు.

నీళ్లపై తేలియాడే యోగా... ప్రపంచ రికార్డుపై బుడతడి గురి!
author img

By

Published : Jul 12, 2019, 5:06 PM IST

నీళ్లపై తేలియాడే యోగా... ప్రపంచ రికార్డుపై బుడతడి గురి!

ప్రపంచం వేగంగా దూసుకెళుతోంది. అంతే వేగంగా ఉన్నారు నేటి తరం పిల్లలు. ఏడేళ్ల ఓ బుడతడు ఏకంగా ప్రపంచ రికార్డుపైనే కన్నేశాడు. యోగా సాధన ద్వారా నీటిపై తేలియాడటంలో నూతన రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించాడు.

ప్రపంచ రికార్డుల విశ్వవిద్యాలయంలో చోటు దక్కించుకునేందుకు రెండు గంటల ఆరు నిమిషాల పాటు యోగాసనం వేసి నీటిపై తేలియాడాడు తిరువనంతపురానికి చెందిన ప్రతీశ్.

ప్రతీశ్​ తండ్రి సతీశ్​కుమార్ సైన్యంలో పనిచేస్తారు. స్వతహాగా యోగాసాధకుడైన సతీశ్ తన కుమారుడికి శిక్షణ ఇచ్చారు. తాజా ఫీట్​ను ప్రపంచ రికార్డు గ్రహీత డా.జస్టిన్ సమక్షంలో చేసి చూపించాడు ప్రతీశ్​. తొలుత గంటపాటు నీటిపై తేలియాడాలని సంకల్పించాడు. కానీ ఏకంగా రెండు గంటల ఆరు నిమిషాల పాటు నీటిపై యోగా చేశాడు. ఇతడి ఘనతను ప్రపంచ రికార్డుల విశ్వవిద్యాలయం అధికారికంగా గుర్తించాల్సి ఉంది.

ఇదీ చూడండి: సభలో బలనిరూపణకు సిద్ధమైన కుమారస్వామి

Intro:Body:

v

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.